వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేగా రేవంత్ మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలే.!మంత్రి హరీష్ రావు ఫైర్.!

|
Google Oneindia TeluguNews

వికారాబాద్/హైదరాబాద్ : గురువారం వికారాబాద్, నారాయణ్ పెట్ జిల్లాల్లో మొత్తం 42.34 కోట్ల రూపాయలతో ఆరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పటు ఎనమిది అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు. కొస్గి ఆసుపత్రిని రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు మంత్రి హరీష్. ఈ సందర్బంగా గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ది చేయలేదని ఘాటుగా విమర్శించారు.

 రేవంత్ రెడ్డి కేవలం మాటల ఎమ్మెల్యే.. కొడంగల్ లో అభివృద్ది శూన్యమన్న మంత్రి హరీష్ రావు..

రేవంత్ రెడ్డి కేవలం మాటల ఎమ్మెల్యే.. కొడంగల్ లో అభివృద్ది శూన్యమన్న మంత్రి హరీష్ రావు..


రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదన్నారు మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేయలేక పోయారని నిలదీసారు. టిఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్త రూపు సంతరించుకున్నదని తెలిపారు. రేపో మాపో పాలమూరు నీళ్ళు తెచ్చి కొడంగల్ రనియోజకవర్గ ప్రజల పాదాలు కడుగుతామన్నరు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కోరిక మేరకు ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచి, మంచి వైద్యాన్ని అందిస్తామన్నారు. నాడు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవని, ఇప్పుడు 100 కి పైగా పెంచుకున్నామన్నారు. కొడంగల్ లోనూ కొత్త కేంద్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు మంత్రి.

 కొడంగల్ లో పలు అభివృద్ది పనులకు శ్రీకారం.. పాల్గొన్న మంత్రి హరీష్ రావు

కొడంగల్ లో పలు అభివృద్ది పనులకు శ్రీకారం.. పాల్గొన్న మంత్రి హరీష్ రావు


పాలమూరు పై కేసులు వేస్తున్నారని, అనేక విదాలుగా అడ్డుకుంటున్నారని, అయినా పనులు ఆగవన్నారు మంత్రి హరీష్ రావు. అతి త్వరలో నీళ్ళు కొడంగల్ వైపు మళ్లిస్తామన్నారు. 60 ఏళ్లలో పూర్తి కాని పనులు ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. మీ పక్కనే కర్ణాటక బార్డర్ ఉందని, ఒక్కసారి అడిగి తెల్సుకొండని కోస్గి ప్రజలను మంత్రి కోరారు. కర్ణాటకలో డబుల్ డెక్కర్ ప్రభుత్వం ఉందని, ఆరు గంటలు కూడా కరెంట్ రావడం లేదని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు హరీష్ రావు.

 రైతు డిక్లరేషన్ పేరుతో డ్రామాలు.. తెలంగాణ ప్రజలు నమ్మొద్దన్న వైద్య మంత్రి

రైతు డిక్లరేషన్ పేరుతో డ్రామాలు.. తెలంగాణ ప్రజలు నమ్మొద్దన్న వైద్య మంత్రి


తెలంగాణ ప్రజలకు సీఎం చంద్రశేఖర్ రావు మాట ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు హరీష్ రావు. కర్ణాటకలో 500 పింఛన్ ఇస్తే, మనం 2016 ఇస్తున్నామని, అతి త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు ఇస్తామని, మరో పది లక్షల మందికి అందుతాయన్నారు మంత్రి హరీష్ రావు. కొడంగల్ లో నీళ్ల కొరత తీవ్రంగా ఉండేదని, సీఎం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అందిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తారని, 8,9 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎందుకు అభివృద్ధి చేయలేదని, ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, బస్ డిపో తేలేకపోగా, రైతు డిక్లరేషన్ పేరుతో డ్రామాలుడుతున్నారన్నారు మంత్రి హరీష్.

 ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు.. అభయహస్తం డబ్బులు కూడా ఇస్తామన్న మంత్రి హరీష్

ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు.. అభయహస్తం డబ్బులు కూడా ఇస్తామన్న మంత్రి హరీష్


కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ లో రైతు డిక్లరేషన్ చేయాలి గాని తెలంగాణలో అవసరం లేదన్నారు మంత్రి హరీష్. కన్న తల్లికి అన్నం పెట్టనోడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు మంత్రి. అభయ హస్తం డబ్బులు ఇప్పటికే ఇస్తున్నామని,మిగిలిన వారికి ఈ నెలలో అందిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని, కేంద్రం తెలంగాణ మీద కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి హరీష్ రావు.

English summary
Minister Harish said the Kosgi hospital would be commissioned in two months. On this occasion, Revanth Reddy, a former MLA, criticized Kodangal for not developing the area at all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X