వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ .. డిమాండ్లు ఇవే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గడచిన మూడు నాలుగు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణమృదంగం మోగుతోంది అని ఆయన పేర్కొన్నారు. అధికారికంగానే నిత్యం 5 నుంచి 10 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే, మరోవైపు మిర్చి రైతులు ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్; ఢిల్లీ వెళ్ళొచ్చిన గులాబీ నేతల్లో గుబులుటీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్; ఢిల్లీ వెళ్ళొచ్చిన గులాబీ నేతల్లో గుబులు

కుప్పలపైనే వరి రైతులు, మిర్చి రైతుల మెడలకు ఉరితాళ్ళు

కుప్పలపైనే వరి రైతులు, మిర్చి రైతుల మెడలకు ఉరితాళ్ళు


తామర పురుగు తెగులుతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నెలలు తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తున్న రైతులు హఠాత్తుగా వాటిపైనే కుప్పకూలుతున్న దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు కనపడుతున్నాయి అని, ఇదే సమయంలో తాజాగా మిర్చి రైతుల మెడలకు బిగుసుకుంటున్న ఉరితాళ్ళు కూడా కలవరపెడుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం చూపాల్సిన మీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసిన చందంగా వ్యవహరిస్తున్నదని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

మిర్చి రైతులకు తెగుళ్ళతో కష్టం, తీరని నష్టం

మిర్చి రైతులకు తెగుళ్ళతో కష్టం, తీరని నష్టం

ఈ సంవత్సరం రైతులు 3,58,557 ఎకరాలలో మిర్చి పంట వేశారని, ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మంచి దిగుబడి వస్తుందని ఆశించారు అని పేర్కొన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా మిర్చి పంటను సాగు చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి మిర్చి పంటకు తామర పురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగులు, కాయ కుళ్ళు తెగులు లాంటివి సోకి పంట పెద్ద ఎత్తున నాశనమైందని రేవంత్ రెడ్డి సీఎం కు రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు.

మరీ దారుణంగా కౌలు రైతుల పరిస్థితి

మరీ దారుణంగా కౌలు రైతుల పరిస్థితి

దీంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని, ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ల దిగుబడి రావలసిన మిర్చి పంట కేవలం అయిదు క్వింటాళ్లు రావడం కూడా గగనంగా మారిందని పేర్కొన్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే మిర్చి రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి అని వెల్లడించారు. రాష్ట్రంలో మిర్చి సాగు చేసిన రైతుల నెత్తిన సగటున 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అప్పు ఉందని పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

ఏడున్నరేళ్ళ పాలనలో ఇప్పటికి సుమారు 40 వేల మంది రైతులు ఆత్మహత్య

ఏడున్నరేళ్ళ పాలనలో ఇప్పటికి సుమారు 40 వేల మంది రైతులు ఆత్మహత్య

రాష్ట్రంలో మిర్చి రైతుల ఆత్మహత్యలకు కారణాలను పరిశీలిస్తే పంట నష్టం, అప్పు తీర్చ లేకపోవడం రెండు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక ఇదే సమయంలో రైతులను ఆదుకోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. మీ ఏడున్నరేళ్ళ పాలనలో ఇప్పటికి సుమారు 40 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మెజారిటీ రైతులకు పరిహారం కూడా అందలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీ పాలనలోనే వచ్చిందంటూ నిప్పులు చెరిగారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం డిమాండ్

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం డిమాండ్

ఇప్పటికైనా మిర్చి రైతుల ఆత్మహత్యల పై దృష్టి సారించాలని తక్షణం మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, మిర్చి రైతుల కుటుంబాలకు భరోసా నింపేలా కార్యాచరణను తీసుకురావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి తిరిగి పంట వేసుకోడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలంటూ లేఖ ద్వారా రైతుల కోసం ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయాలను సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. తన లేఖ ద్వారా రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలను ఏకరువు పెట్టారు రేవంత్ రెడ్డి.

English summary
TPCC chief Revanth Reddy wrote an open letter to CM KCR, demands compensation of 10 lakh rupees to the chilies farmers families who committed suicides. He said the death toll of farmers in the state was staggering
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X