రేవంత్ సంచలనం: వైఎస్ ను తిడితే జగన్ నోరు మెదప లేదు: షర్మిలను పావుగా..ఇద్దరి స్కెచ్ ఇది ..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..షర్మిల లక్ష్యంగా తన దైన శైలిలో టార్గెట్ చేసారు. తెలంగాణకు నీళ్ళు సంస్కృతి... కానీ అవే నీళ్లు కేసీఆర్ కు ఏటీఎం గా మారాయంటూ ఫైర్ అయ్యారు. పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా ...ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించడం సహాజ సూత్రాలకు విరుద్ధమని చెప్పుకొచ్చారు. రెండు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి ఇరు వర్గాలు లబ్ది పొందుతున్నారంటూ మండిపడ్డారు.

జగన్ చెప్పిందే చేస్తున్నారు..

జగన్ చెప్పిందే చేస్తున్నారు..

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 11టీఏంసీల నీరు జగన్ ప్రభుత్వం తరలించబోతుందని ఆరోపించారు. కానీ , తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రోజు కు 1 టీఎంసీ ల నీరు కు మించి తరలించలేదని వివరించారు. జూరాలలో కనిపించిన నీరు...సంగంబండ తర్వాత కనపించదని చెప్పారు. సంగంబండ దగ్గర జలదోపిడి జరుగుతుంది.. దీనికి ప్రధాన కారకుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కృష్ణా నది నుండి ఏపీ ఎన్నీ నీళ్లు తీసుకోబోతుందో స్పష్టంగా అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేసారు. ఆ తర్వాత ప్రగతి భవన్ లో జగన్ కు కేసీఆర్ అథితి మర్యాదలు చేసారని ఎద్దేవా చేసారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ సమావేశం తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచారని చెప్పుకొచ్చారు.

 కేసీఆర్ పట్టించుకోక పోవటం వలనే..

కేసీఆర్ పట్టించుకోక పోవటం వలనే..

ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసిందన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం పట్టనట్లే ఉందని ఆరోపించారు. ఓక సామాన్య వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసువేస్తే...ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఇంప్లీడ్ పిటిషన్ వేసిందన్నారు. కృష్ణా బేసిన్ నీళ్ళను పెన్నా బేసిన్ నీళ్ళను తరలిస్తుంటే...వాదనలలో పస లేని రాంచంద్ర రావు ను లాయర్ గా పెట్టారంటూ వ్యాఖ్యానించారు. ఎన్ జీ టీ లో సమర్దవంతమైన వాదనలు వినిపించకుండ పోవడం వల్ల ఇప్పుడు మనకు ప్రమాదం వచ్చిందని రేవంత్ చెప్పారు. జగన్ కు కేసీఆర్ అమ్ముడు పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

 ఆ ఇద్దరినీ తిడితే కుష్ఠు వస్తుంది..

ఆ ఇద్దరినీ తిడితే కుష్ఠు వస్తుంది..

జులై 8 వైఎస్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ కూతురు తెలంగాణ లో పార్టీ ప్రారంబించబోతుందని చెప్పారు. వైఎస్ అంటే తెలంగాణ లో రైతులు గుర్తుకు వస్తారన్నారు. అంతే గాని తెలంగాణ లో ఏం చేసినా చెల్లుతుంది అంటే కుదరదని హెచ్చరించారు. ఎన్టీఆర్ ,వైఎస్ అంటే సంక్షేమం గుర్తుకు వస్తుందన్నారు. వైఎస్ కొడుకు ను ఇంటికి పిలిచి మర్యాద చేస్తారని...అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకు తిడుతున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు ,కేటీఆర్ ఆర్థిక ప్రయోజనం వల్లే తెలంగాణకు ఈ గతి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై పోలీసులెందుకు...ఎవరిని రెచ్చగొట్టడం కోసమని ప్రశ్నించారు.

షర్మిలను ఒక పావుగా వాడుతున్నారు..

షర్మిలను ఒక పావుగా వాడుతున్నారు..


తెలంగాణ లో ఉన్న ఆంధ్ర వాల్లకోసమే గట్టిగా మాట్లాడట్లేదంటుంన్న జగన్.. తన తండ్రి ని తిడితే నోరు మెదపని వాడు..ఏపీ కి ఏం న్యాయం చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ ను తిడితే...అటు జగన్ ,ఇటు విజయమ్మ ఓక్కరు కూడా నోరు మెదపలేదని వ్యాఖ్యానించారు. జగన్ ను కేసీఆర్ ,షర్మిల ఏందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ లకు వెళ్లిన నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు రాకుండా చేసేందుకు ..వైఎస్ షర్మిల ను పావుగా వాడుతున్నారుని చెప్పుకొచ్చారు. జలవివాదాలతో లబ్ది పొందేందుకు జగన్ ,కేసీఆర్ వేసిన స్కెచ్ అంటూ రేవంత్ ఆరోపించారు. కృత్రిమ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వైఎస్ కూడా రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాడే..ఇది షర్మిల తెలుసుకోవాలని సూచించారు. నీళ్లు ,నిధులు ,నియామకాలు.. ఈ మూడే కేసీఆర్ ను గద్దె దించుతాయని రేవంత్ జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+