నిరుద్యోగులకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభయ హస్తం హామీలను అమలు చేయడానికి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి హామీల అమలుపై ఫోకస్ పెట్టారు.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న నిరుద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలని రేవంత్ రెడ్డి సంకల్పించారని టాక్ వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖలో పదవీ విరమణ చేయనున్న వారితో సహా, పలు పోస్టుల ఖాళీలపై వివరాలను సేకరిస్తుంది. మొత్తం ఈ సంవత్సరం తెలంగాణలో 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు . 2021లో వారు పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వ రిటైర్మెంట్ వయస్సును మూడేళ్లకు పెంచడంతో ప్రస్తుతం వారు ఇంకా పని చేస్తున్నారు. అయితే వీరంతా ఈ మార్చి నెలాఖరు నుండి పదవీ విరమణ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే గత సంవత్సరం ఆగస్టులో కేసీఆర్ సర్కార్ 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇప్పుడు ఆ ఖాళీల సంఖ్యను మరింత పెంచి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. పాత నోటిఫికేషన్ కు సుమారు మరో 5000 పోస్టులను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ను ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ లోపు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న రేవంత్ సర్కార్ ఈ ప్రయత్నంలో ఏ మేరకు సఫలం అవుతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications