తల్లిదండ్రులకు శుభవార్త.. మీ చిన్నారుల కోసం త్వరలో సూపర్ స్కీమ్!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ భరోసా కల్పిస్తోంది. ఇదే క్రమంలో రేవంత్ ప్రభుత్వం త్వరలోనే చిన్నారుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తున్న రేవంత్ ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య మెరుగుదలకు ఈ పథకాన్ని తీసుకురాబోతున్నట్టు సమాచారం.
ఐదేళ్ళ లోపు చిన్నారుల ఆరోగ్య రక్షణకు కొత్త పథకం
బాల భరోసా పేరుతో ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్, ఈ పథకం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలని సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల అనారోగ్యంతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు ఈ పథకం ద్వారా శుభవార్త చెప్పింది. ఐదేళ్లలోపు వయసు ఉన్న వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలను అందించడానికి బాల భరోసా పథకాన్ని తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

8 లక్షల మంది చిన్నారులకు అనారోగ్య సమస్యలు
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది నిర్వహించిన సర్వేలో సుమారు 8 లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన రేవంత్ సర్కార్ వీరందరికీ ఉచిత వైద్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. చిన్నారులలో చాలామంది రక్తహీనత, వినికిడి, దృష్టి లోపాలు, వయసుకు తగిన ఎదుగుదల లేక పోషకాహార లోపాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం వీరందరికీ ఉచిత వైద్య భరోసా కల్పించనుంది.
ఉచిత వైద్యం, ఆపరేషన్లు
ఈ పథకం కింద వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు, వినికిడి లోపం ఉన్నవారికి యంత్రాలను అమర్చడంతో పాటు ఇతర వైద్య సేవలను అందించనున్నట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖతో పాటు మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. దీనిని ఆరోగ్య శ్రీ పథకానికి అనుసంధానం చేయనున్నారు. బాల భరోసా వర్తించని అనారోగ్య సమస్యలకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసహాయం అందించడానికి కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకంతో కలిపి
అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న రాష్ట్రీయ బాల స్వస్త్య పథకాన్ని కూడా బాల భరోసాతో అనుసంధానం చేయనున్నారు. ఈ పథకం సక్రమ అమలు కోసం ఒక కొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ప్రతి చిన్నారి వైద్య చరిత్రను ట్రాక్ చేసి, తదనుగుణంగా చికిత్స అందించి, దాని పురోగతిని పర్యవేక్షిస్తారు.
త్వరలోనే ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మొత్తంగా చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అమలు చేయాలని భావిస్తున్న బాల భరోసా పథకం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం సక్సెస్ అయితే రాష్ట్రంలోని లక్షల మంది చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications