Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదానీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం!

దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న అదానీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది . అదానీ ఇచ్చే డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి వద్దని తేల్చిపారేసింది. యూఎస్ లో అదానిపైన లంచం, మోసం ఆరోపణల కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా గౌతమ్ అదాని అవినీతి అంశం పైన చర్చ జరుగుతుంది. ఈరోజు పార్లమెంటు ఉభయ సభలలో వ్యవహారం పైన చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పట్టుపట్టి రచ్చ చేశాయి.

అదానీ విషయంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
ఇక ఇదే సమయంలో అదానీ వ్యవహారంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అదానీ గ్రూప్ పై ఉన్న తాజా వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే అదానీ వ్యవహారంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ఆదానీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందని, బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తుంది.

Revanth govt sensation on Adani case Rs 100 crore fund rejection for skill india university

అదానీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందన
కాంగ్రెస్ హై కమాండ్ కు తెలియకుండానే ఆదానితో ఒప్పందాలు జరిగాయా అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందిస్తూ సంచలన విషయాలను వెల్లడించారు. అదానీ వ్యవహారానికి సంబంధించి చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే స్కిల్ యూనివర్సిటీ కోసం విరాళాలు సేకరించామని చాలా మంది విరాళాలు ఇచ్చారని ఆయన తెలిపారు.

ఆ విరాళం నిరాకరణ.. లేఖ రాశామన్న రేవంత్
అందులో భాగంగానే 100 కోట్ల రూపాయలు అదాని స్కిల్ యూనివర్సిటీ కోసం ఇస్తామని తెలిపారని, అయితే అదాని నుండి ఆ నిధులను నిరాకరిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదానీ డబ్బు తెలంగాణ రాష్ట్రానికి వద్దని, ఆయన ఇచ్చే 100 కోట్ల రూపాయలను నిరాకరిస్తూ ఆదానికి లేఖ రాశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిణామాలతో నిర్ణయం తీసుకున్నామన్న రేవంత్
స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఏ సంస్థ నుండి తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, అందులో అదానీ నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదానీపై కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదానీతో తెలంగాణాకు సంబంధం లేదన్నారు.

ఢిల్లీ పర్యటనపై చేస్తున్న వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్
ఇదే సమయంలో కొంతమంది తన ఢిల్లీ పర్యటన పైన పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని తాను ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను లాలూచీ పనులు చేయడం కోసం ఢిల్లీ వెళ్లడం లేదని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానన్నారు. మీ కడుపు మంట, దుఃఖం తనకు తెలుసు అంటూ రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీల నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ హయాంలో అదానీతో చాలా ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి .అదానికి కాంట్రాక్టులు, భూములు ఇచ్చింది వాళ్లేనని టార్గెట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+