Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీఎస్సీ మోడల్‌లో టీఎస్‌పీఎస్సీ: ఛైర్మన్‌తో రేవంత్ భేటీ: పూర్తిస్థాయి ప్రక్షాళన

TSPSC: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తోన్నారు. మెరికల్లాంటి బ్యురోక్రాట్లను కీలక స్థానాల్లో నియమిస్తోన్నారు.

శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న తప్పులను సరిదిద్దుతున్నారు.

Revanth Reddy and Uttam Kumar Reddy has called on UPSC Chairman Manoj Soni

ఈ క్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పూర్తిస్థాయి ప్రక్షాళనకు పూనుకున్నారాయన. గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ (TSPSC)లో చోొటు చేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనివల్ల షెడ్యూల్ అయిన పలు పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది.

కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమిలో టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. పరీక్షలను సైతం సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందనే చెడ్డపేరును మూటగట్టుకుంది. ఈ వ్యవహారం యువత, నిరుద్యోగుల ఓటుబ్యాంకును బీఆర్ఎస్‌కు దూరం చేసిందనడంలో సందేహాలకు అవకాశం లేకుండా చేసింది.

అలాంటి టీఎస్‌పీఎస్సీలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయనున్నారు రేవంత్ రెడ్డి. టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి బీఎం సంతోష్‌‌ను బదిలీ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమించారు. మున్ముందు మరిన్ని భారీ మార్పులు- చేర్పులకు తెర తీయనున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యకలాపాలన్నీ కూడా పటిష్టంగా ఉండేలా యంత్రాంగాన్ని రూపొందించనున్నారు.

ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మోడల్‌ను ప్రవేశపెట్టడంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. టీఎస్‌పీఎస్సీలో ప్రక్షాళన కోసం యూపీఎస్సీ సహకారాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. తన మంత్రి వర్గ సహచరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యూపీఎస్‌సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు.

టీఎస్‌పీఎస్సీ గురించి చర్చించారు. గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న లోటుపాట్లు, తప్పొప్పులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జాబ్ నోటిఫికేషన్లను వెలువడించడం గానీ, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించడంలో గానీ, వాటి ఎవాల్యుయేషన్‌లో గానీ తమకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై మదన్ సోనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+