వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ కు జంతర్ మంతర్లో ధర్నా చేసే దమ్ముందా .. రేవంత్ సవాల్ .. ఉత్తమ్ ఫైర్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం వ్యవసాయ బిల్లు పై విమర్శలు గుప్పిస్తున్నా , టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు బీజేపీ పై ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుపైన కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

వ్యవసాయ బిల్లు రైతుల పాలిట ఉరితాడుగా మారిందన్న రేవంత్
ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు రైతుల పాలిట ఉరితాడుగా మారిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇది కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉందని, ఈ బిల్లు వల్ల చిన్న సన్నకారు రైతులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.ఇక టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తూనే బయట షో చేస్తుందంటూ విమర్శించారు రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో చర్చలో పాల్గొనకుండా రాజ్యసభలో హడావిడి చేస్తూ బిల్డప్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు.

టిఆర్ఎస్ పార్టీ నేతలు గోతికాడ నక్కలు
టిఆర్ఎస్ పార్టీ నేతలు గోతికాడ నక్కల లాంటి వాళ్లని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.
నిజంగానే టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, సీఎం కేసీఆర్ వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లుగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇది కార్పోరేట్ వ్యవసాయ బిల్లు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
టిపిసిసి చీఫ్ ,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై భగ్గుమన్నారు. ఈ బిల్లుకు కార్పొరేట్ వ్యవసాయ బిల్లు అని పేరు పెడితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు వల్ల ఏ ఒక్క రైతుకు లాభం చేకూరదని, దీని ప్రభావంతో మార్కెట్ యార్డులు మూసి వేసే అవకాశం కూడా లేకపోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీలు అయిన అదానీ, అంబానీ వాళ్లకు లాభం చేకూరేలా బిల్లు ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Recommended Video

పూర్తిగా రైతు వ్యతిరేక బిల్లు .. ఫైర్ అయిన ఉత్తమ్
కంపెనీలకు రైతులతో నేరుగా టైఅప్ అయ్యేవిధంగా బిల్లు ఉందని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బిల్లుతో ఏ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదని తేల్చి చెప్పారు. కనీస మద్దతు ధర మీద క్లారిటీ కూడా లేకుండా బిల్లు ఉందని, ప్రైవేట్ కంపెనీల కొనుగోలు ఏవిధంగా చేస్తుందో కూడా చెప్పకుండా బిల్లును ప్రవేశపెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక బిల్లు అని ఆయన ఫైర్ అయ్యారు. వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications