అలా జరిగితే కేటీఆర్ సారీ చెబుతారా?: రేవంత్ రెడ్డి సవాల్, సంబరాలు షురూ అంటూ హ్యాపీ
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వస్తుందనే తేల్చాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, డిసెంబరు 3న ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. తెలంగాణకు పదేళ్లుగా పట్టిన పీడ తొలగిపోనుందన్నారు. ఓటమి ఖాయమని తెలిసినప్పుడే కేసీఆర్ నియోజకవర్గం మార్చారని ఆరోపించారు రేవంత్.
ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ చైతన్యవంతమైందని.. కామారెడ్డి ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబరు 3కు ప్రత్యేక స్థానం ఉందని.. ఆరోజే శ్రీకాంత్‌చారి తుదిశ్వాస విడిచారన్నారు. శ్రీకాంత్‌చారి ఘటనతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని రేవంత్ గుర్తు చేశారు.

డిసెంబరు 3న దొరలు తెలంగాణ అంతమై.. ప్రజల తెలంగాణ విష్కృతమవుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల చైతన్యం మీద తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. బీఆర్‌ఎస్(BRS) పార్టీకు 25 కంటే ఒక్క సీటు కూడా దాటదని.. సునామీ వస్తే.. గడ్డపారలే కొట్టుకుపోతాయి.. గడ్డిపోచ ఓ లెక్కా అంటూ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో పోలింగ్ ముగియగానే కేసీఆర్ వచ్చేవారు.. కానీ ఓటమి ఖాయమని తెలిసే కేసీఆర్ ముఖం చాటేశారని విమర్శించారు. కేటీఆర్ కూడా త్వరలోనే అమెరికాకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు రేవంత్.
అధిష్ఠానం సూచన ప్రకారం సీఎల్పీ సమావేశం నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు. సీఎల్పీలో చర్చించి ప్రభుత్వ ఏర్పాటు తేదీని నిర్ణయిస్తామన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఎంఐఎం ప్రస్తుతం బీజేపీతో ఉందని.. అందుకే మైనార్టీలను ప్రభుత్వంలో కలుపుకొని పోతామని అన్నారు. మెజార్టీల పట్ల ఉన్న విధానమే మైనార్టీల పట్లు ఉంటుందన్నారు. తెలంగాణ గెలుపులో కాంగ్రెస్ అగ్రనాయకత్వానిది కీలకపాత్ర అని చెప్పారు.
బీఆర్‌ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యమని.. ప్రజలంటే వారికి చిన్నచూపు ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు డిసెంబర్ 3 వరకు ఆగాల్సిన పనిలేదని.. ఈరోజు నుంచే సంబురాలు చేసుకోవచ్చన్నారు రేవంత్. పారదర్శక ప్రభుత్వాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో విపక్షాల అభిప్రాయాలకు విలువ ఉంటుందన్నారు. కేసీఆర్‌లాగా నిరంకుశంగా కాంగ్రెస్ నేతలు ఉండరన్నారు. ప్రజల సమస్యలు చూపించే మీడియాకు కూడా స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. తాము పాలకులుగా ఉండమని.. సేవకులుగా ఉంటామని తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ చూసి కేటీఆర్ వచ్చి భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు రేవంత్. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ వచ్చి మాట్లాడాడు అంటే దుకాణం బంద్ అయినట్లేనని.. కేసీఆర్ మోహం చాటేశారన్నారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదిని.. డిసెంబర్ 3న ఫలితాల్లో బీఆర్ఎస్ 70కిపైగా సీట్లు గెలుచుకుంటుందన్నారు కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన పనిలేదన్నారు. 3న ఫలితాలు తారుమారైతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన సంస్థలు ప్రజలకు క్షమాపణలు చెబుతాయా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్.. కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications