కేసీఆర్ మందుబాబులకు రోల్ మోడల్, ఫస్ట్ ర్యాంకు అందుకేనా? : రేవంత్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : సందర్బం వచ్చిన ప్రతీసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడే టీటీడీపీ ఫైర్ బ్రాండ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన నగరంలో ఉన్న పబ్ ల నిర్వహణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ను మందుబాబులకు రోల్ మోడల్ అంటూ ఎద్దేవా చేశారు రేవంత్. నగరంలో పేకాట క్లబ్ లను మూసేసిన కేసీఆర్ కు పబ్ లు మాత్రం కనబడడం లేదా..? అంటూ ప్రశ్నించారాయన. తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగా వస్తే, అధికారం మాత్రం కేసీఆర్ అనుభవిస్తున్నారని విమర్శించారు.

పదవులు అనుభవించడం త్యాగాల కిందకు వస్తుందా..? అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన ఆయన, మిత్రపక్షం బీజేపీ వ్యవహార శైలిని తప్పుబట్టారు. తెలంగాణలో టీడీపీ లేదంటూ బీజేపీ చెప్పుకురావడం మిత్రధర్మానికి విరుద్దంగా వ్యవహరించడమేనని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Revanth Reddy criticized BJP for giving 1st rank to CM KCR

అలాగే ప్రభుత్వ పనితీరును ప్రశ్నించలేని ప్రతిపక్షాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని మండిపడ్డ రేవంత్, తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ అవసరంలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు రెండు టీఆర్ఎస్ కు అనుబంధ సంఘాలుగా మారాయని ఆరోపించారు రేవంత్.

ఇక తాజాగా వెలువడ్డ సర్వేల గురించి ప్రస్తావిస్తూ.. 'దేశంలో నంబర్-1 సీఎంగా కేసీఆర్ కు బీజేపీ సర్టిఫికెట్ ఇచ్చిందని, కేసీఆర్ నంబర్-1 అయితే ఇక దేశానికి బీజేపీ అవసరమేముందని' ప్రశ్నించారు. పనిని పక్కనబెట్టి ఫాంహౌజ్ లో పడుకున్నందుకే కేసీఆర్ కు నంబర్-1 కట్టబెట్టారా..? అని విమర్శించారు రేవంత్.

దిగ్విజయ్ సింగ్ వచ్చి కదిలిస్తే తప్ప చలనం లేని స్థితిలో కాంగ్రెస్ ఉందని ఆరోపించిన రేవంత్, కాంగ్రెస్ లో ఒక్కో నేతది ఒక్కో తీరు అన్న తరహాలో విమర్శలు గుప్పించారు. ఒక కాంగ్రెస్ నేత రూ.5 భోజనం, హరిత హారం బాగున్నాయని పొగిడితే, మరో కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ పనితీరు అవినీతిమయం అంటున్నారని విమర్శించారు.

కేసీఆర్ ది ఓ మాట.. హరీశ్ రావుది ఇంకో మాట : రావుల చంద్రశేఖర్ రెడ్డి

ఇదే సమావేశంలో మాట్లాడిన మరో టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ విషయంలో కేసీఆర్ ఒకటి చెబితే, హరీశ్ రావు ఇంకొకటి చెబుతున్నారని అన్నారు. పార్లమెంటు చట్టంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న ఆయన, అదే పార్లమెంటు ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం మాత్రం ఎందుకు పనికి రాదు అని ప్రశ్నించారు. జీవో 123లో నిర్వాసితులకు పునరావాసం అంశాన్ని ఎక్కడ పొందుపర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana telugu desam working president Revanth Reddy again fired on CM KCR. He criticized BJP for giving 1st rank to CM KCR. He asked why BJP was given 1st rank to KCR

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి