అరెస్ట్ టైమ్ లో ఏం జరిగింది.. పూసగుచ్చినట్లు చెప్పిన రేవంత్ కూతురు నైమిషారెడ్డి

కొడంగల్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు ఆయన కూతురు నైమిషారెడ్డి. ఈమేరకు ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. తెల్లవారుజామున పోలీసులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో నైమిషారెడ్డి అక్కడే ఉన్నారు. పోలీసులు బలవంతంగా మా ఇంట్లోకి చొరబడ్డారని ఆరోపించారు.

ఆమె మాట్లాడిన వీడియో సారాంశం :
పోలీసులమని చెప్పి యాభై మంది వరకు వ్యక్తులు మా ఇంట్లోకి చొచ్చుకొచ్చారు. మా అమ్మ నాన్న నిద్రిస్తున్న బెడ్రూమ్ తలుపులు పగులగొట్టారు. సెర్చ్ పేపర్లంటూ ఏవో చూపించారే తప్ప అవి చదివే టైమ్ కూడా ఇవ్వలేదు. పైగా తీవ్రవాదులను, నేరస్థులను లాక్కెల్లినట్లుగా మా డాడీని తీసుకెళ్లారు. అంతేకాదు ఆయన బ్రదర్స్ ను, అనుచరులను పట్టుకెళ్లారు. ఇదంతా కూడా కక్షసాధింపే.. ఎన్నికల సమయంలో మా డాడీని ఇబ్బందులు పెట్టడమే. అయితే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులుగా
మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. కొంతమంది ఐడీ కార్డులు లేకుండా పోలీసులమని చెప్పి వచ్చారు. అసలు మా డాడీని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఇప్పుడు ఎక్కడున్నారనే విషయాలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.
మా ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడ్డారు : రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి#Revanthreddy #Nymishareddy #Revantharrest #TelanganaElection2018 pic.twitter.com/WPVh7wGn7M
— Oneindia Telugu (@oneindiatelugu) December 4, 2018
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!