Revanth Reddy:కేరళం గడ్డపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..ఇద్దరి మధ్య సీక్రెట్ డీల్..!!

కేరళ ఎన్నికల ప్రచార పర్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ను టార్గెట్ చేస్తూ, ఆయనకు ప్రధాని మోదీకి మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ప్రముఖ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ సీఎం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేరళ రాజకీయాల్లో ఇప్పుడొక కొత్త వేడి మొదలైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి ఎల్డీఎఫ్ (LDF) ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న అప్రకటిత బంధాన్ని ఆయన విశ్లేషించిన తీరు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

revanth-reddy-s-explosive-claims-modi-vijayan-secret-deal-sparks-debate

బంగారం స్మగ్లింగ్ కేసులు..అండగా మోదీ

పినరయి విజయన్ పై ఉన్న అవినీతి ఆరోపణలను రేవంత్ రెడ్డి నేరుగా ప్రస్తావించారు. శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ వంటి తీవ్రమైన కేసులు విజయన్‌పై ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. "దేశం కోసం ఆస్తులు, జీవితాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని చిన్న చిన్న కేసులతో వేధిస్తున్న బీజేపీ ప్రభుత్వం..విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదు? కేజ్రీవాల్ వంటి నేతలను ఈడీ కేసులతో అరెస్టు చేసిన కేంద్రం,విజయన్‌ను ఎందుకు విడిచిపెట్టింది? దీనికి కారణం విజయన్ గాడ్‌ఫాదర్ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉండటమే" అని రేవంత్ ఆరోపించారు.

అవగాహనతోనే అరెస్టులు లేవు..

ప్రధాని మోదీ కేరళం సీఎం విజయన్ మధ్య ఉన్న రహస్య అవగాహన వల్లే కేసులు అటకెక్కాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న బంధాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారని, రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.ఈ ఎన్నికల్లో కేరళ ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని,కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF)విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో తన పట్టు పెంచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి,రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగా మారారు.కేరళలో లెఫ్ట్ మరియు కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో,బీజేపీ-లెఫ్ట్ ఒక్కటేనని రేవంత్ చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆలోచింపజేసేలా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న రేవంత్, అదే ఫార్ములాను కేరళలో కూడా ప్రయోగిస్తున్నారు.

"తెలంగాణలో మార్పు వచ్చింది.. ఇప్పుడు కేరళ వంతు" అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన నినాదం ఆ రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్ని మారుస్తుందో లేదో చూడాలి. అవినీతి ఆరోపణలు, కేంద్ర సంస్థల దర్యాప్తుపై ఆయన సంధించిన ప్రశ్నలు పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. కేరళ ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+