కఠినాత్ముడు: కెసిఆర్‌పై రేవంత్, వెళ్లొద్దన్న ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వలస రాజకీయాలకు తెలంగాణ సిఎం క్యాంపు కార్యాలయం కేంద్ర బిందువైందని ఆరోపించారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. రైతు సమస్యలపై స్పందించని కఠినాథ్ముడు కెసిఆర్ అని విమర్శించారు. సిఎం బంధువులకు కాంట్రాక్టులు కట్టబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

పార్టీని వీడి వెళ్లొద్దు: ఎర్రబెల్లి

తాను తన ప్రాణం ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టిడిపి బస్సుయాత్ర తెలిసే కెసిఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. మూడు నెలలు ఏమి చేయని కెసిఆర్.. తమ బస్సు యాత్రతో కదిలారని అన్నారు. తెలుగుదేశం శ్రేణులు పార్టీని వీడవద్దని ఆయన సూచించారు.

Revanth Reddy fires at KCR

కరెంటు కష్టాలకు బాబే కారణం: ఈటెల

రాష్ట్రంలో నెలకొన్న కరెంటు కష్టాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడే కారణమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

కృష్ణపట్నం విద్యుదుత్పత్తి కేంద్రంలో తమకు 54శాతం వాటా ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పినప్పుడు ఇక్కడి అవసరాలకు విద్యుత్ ఇవ్వరా? అని ఈటెల రాజేందర్ నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+