బ్యాడ్ న్యూస్.. వాహనదారులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్!
తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు షాక్ ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం రెడీ అయింది. చాలా రాష్ట్రాలలో రవాణాశాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసిన తెలంగాణ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనదారుల జేబులకు చిల్లుపడే అవకాశం కూడా ఉంది.
పక్క రాష్ట్రాలలో రవాణా శాఖ ఆదాయంపైన అధ్యయనం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పెట్రోల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్డు ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపైన కసరత్తు ప్రారంభించిన అధికారులు పక్క రాష్ట్రాలలోని రవాణా శాఖలో వస్తున్న ఆదాయంపైన అధ్యయనం చేశారు.

వాహనాలకు రోడ్ ట్యాక్స్ పెరిగే అవకాశం
పక్క రాష్ట్రాలలో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపైన అధ్యయనం చేసి దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘానికి ఇవ్వడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ రోడ్డు టాక్స్ పెంచితే లక్ష రూపాయల కంటే ఎక్కువ ధరలు ఉన్న బైకులు, 10 లక్షల కంటే ఎక్కువ విలువైన కార్లకు రోడ్డు టాక్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
రోడ్ ట్యాక్స్ పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు టాక్స్ పెరిగే అవకాశం ఉన్నా, అది ఇతర రాష్ట్రాల కంటే తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రోడ్డు టాక్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సుమారు 7000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒకవేళ రోడ్డు టాక్స్ పెంచితే 8,000 కోట్ల రూపాయల నుంచి 9000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు రోడ్ ట్యాక్స్ వసూలు ఇలా
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఐదు లక్షల రూపాయల ధర లోపు ఉన్న కార్లకు 13 శాతం , ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల మధ్య ధర ఉన్న కార్ల కోసం 14%, 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల మధ్య ధర ఉన్న కార్ల కోసం 17%, 20 లక్షల రూపాయల నుంచి ఆ పైన ధర ఉన్న కార్ల కు 18 శాతం టాక్స్ వసూలు చేస్తున్నారు.
రోడ్ ట్యాక్స్ పెరిగితే కొత్త వాహనాలు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్
ఇక ద్విచక్ర వాహనాలకు సంబంధించి 50 వేల లోపు వాహనాలకు 9 శాతం ఆపై విలువ ఉంటే 12 శాతం రోడ్ టాక్స్ వసూలు చేస్తున్నారు ఇక ప్రస్తుతం మళ్లీ రోడ్డు టాక్స్ పెంచాలని అధికారుల ప్రతిపాదనలను సబ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే కొత్త వాహనాలు కొనాలనుకునే వారికి ఇది బాడ్ న్యూస్ అనే చెప్పాలి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications