అంతా రేవంత్ రెడ్డి వల్లే, ఎదురుదాడి: ఇరకాటంలో నేతలు, జీర్ణించుకోలేని బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Trending News : Top 20 Latest News Updates | Oneindia Telugu

  హైదరాబాద్/అమరావతి: తెలంగాణ టిడిపి నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో చేరికపై తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డైలమాలో ఉన్నట్లుగానే కనిపిస్తోంది.

  చదవండి: రేవంత్ రెడ్డి టార్గెట్ అతనే: ఎవరీ పుట్ట సుధాకర్ యాదవ్?

  ఈ నేపథ్యంలో ఆయనపై టిడిపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. అధికార తెరాస నేతలు అయితే ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

  చదవండి: రేవంత్ తగ్గడం వెనుక కారణాలు అనేకం: నష్టం జరిగాక ఆలస్యంగా, ఇలా షాక్, వీటికి సమాధానమేది?

  ఓ విధంగా తన చర్యలతో రేవంత్ రెడ్డి ఇబ్బందిపాలు కావడమే కాకుండా టిడిపిని కూడా మరింత చిక్కుల్లో పడేశారని అంటున్నారు. ఆయన చర్యల వల్ల ఇప్పుడు ఏపీ టీడీపి నేతలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.

  చదవండి: అంతా తూచ్, అబద్దం, మా నేతలను అంటారా: హఠాత్తుగా రేవంత్ యూటర్న్, ఎందుకు!?

  తమను లాగడంపై ఆగ్రహం, చంద్రబాబు జీర్ణించుకోవట్లేదా?

  తమను లాగడంపై ఆగ్రహం, చంద్రబాబు జీర్ణించుకోవట్లేదా?

  కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామనుకున్న రేవంత్ రెడ్డి తన దారిన తాను వెళ్లకుండా ఏపీ నేతలపై విమర్శలు గుప్పించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు దీనిని జీర్ణించుకోవడం లేదట. ఆరోపణలు ఎదుర్కొన్న యనమల, పరిటాల సునీత వంటి వారు మౌనంగా ఉన్నప్పటికీ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ ఆరోపణలపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ఏపీ కాంగ్రెస్, వైసిపి డిమాండ్ చేస్తోంది. ఏపీ నేతలు తెలంగాణ నుంచి లబ్ధి పొందారన్న రేవంత్ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా రేవంత్ వల్ల జరిగిందని వారు ఆవేదనగా ఉన్నారు.

  పయ్యావులతో ఎదురుదాడి ప్రారంభం

  పయ్యావులతో ఎదురుదాడి ప్రారంభం

  రేవంత్ రెడ్డి ఇంత చేసిన తర్వాత ఆయన పార్టీలో ఉండాలంటే కచ్చితంగా వివరణ తీసుకోవాల్సిందేనని ఏపీ, తెలంగాణ టిడిపి నేతలు ఎక్కువమంది భావిస్తున్నారు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాల్సిందేనని, వివరణ ఇవ్వాల్సిందే అంటున్నారు. లేదా ఆయన వెళ్తానంటే మౌనంగా వెళ్లాలని, తమపై ఇష్టారీతిన విమర్శలు చేసి వెళ్తే మాత్రం ఊరుకునేది లేదని అంతర్గతంగా టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు. ఏపీ నేతలపై విమర్శలకు పయ్యావులతో ఎదురుదాడి ప్రారంభమైందని గుర్తు చేస్తున్నారు.

  టి-టిడిపితో పాటు రంగంలోకి ఏపీ టిడిపి నేతలు

  టి-టిడిపితో పాటు రంగంలోకి ఏపీ టిడిపి నేతలు

  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం మొదలు కాగానే తెలంగాణ టిడిపి నేతలతో పాటు ఏపీ టిడిపి నేతలు తెలంగాణలో పార్టీని కాపాడేందుకు రంగంలోకి దిగారు. రేవంత్ పార్టీ మారినా నష్టం లేదని, ఏపీలోనైనా కాంగ్రెస్‌కు ఒకటి రెండు సీట్లు వస్తాయని, తెలంగాణలో అవి కూడా రావని ఎంపీ తోట నర్సింహం అన్నారు. ఏపీ టిడిపి నేతలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అంతర్గత విషయాలను బయటపెట్టవద్దని బుద్దా వెంకన్న వంటి నేతలు సూచించారు.

  రేవంత్ వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ ఏపీ నేతలు

  రేవంత్ వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ ఏపీ నేతలు

  రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణలో, ఏపీలో నష్టం వాటిల్లకుండా ఇరు తెలుగు రాష్ట్రాల టిడిపి నేతలు రంగంలోకి దిగారు. కానీ రేవంత్‌తో పాటు టిడిపికి జరగాల్సిన నష్టం జరిగిందంటున్నారు. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ టిడిపి నేతలు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారు వివరణ ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు.

  వరుసగా వివరణలు

  వరుసగా వివరణలు

  ఇప్పటికే పయ్యావుల కేశవ్ తనపై రేవంత్ చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. యనమలను కూడా రేవంత్ టార్గెట్ చేశారు. అయితే ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఉద్దేశించి రేవంత్ విమర్శలు చేశారు. వీటిపై పుట్టా కూడా స్పందించారు. తాను తెలంగాణలో రూ.1500 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ పొందినట్లు రేవంత్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

  రేవంత్ లాంటి వల్లే ఓడిపోయా

  రేవంత్ లాంటి వల్లే ఓడిపోయా

  తన ఓటమిపై రేవంత్‌కు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. రేవంత్ లాంటివారి వల్లే తాను ఓడిపోయానని, తన మేనల్లుడు అతడి మిత్రులతో కలిసి బార్ పెట్టాడని, దానిని బీర్ ఫ్యాక్టరీ అనడం దుర్మార్గమన్నారు. అందులో తనకు వాటా లేదన్నారు. రేవంత్ తన వ్యాపారాల గురించి చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ కూతురు కవితతో కలిసి కంపెనీ రిజిస్టర్ చేసిన మాటేమిటని రేవంత్‌ను నిలదీశారు. తెలంగాణలో వైసిపితో రేవంత్ అంటకాగారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో తనకు లంకె పెట్టడం సరికాదన్నారు. తనకు, పరిటాల సునీతకు వ్యాపార సంబంధాల్లేవని తేల్చి చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Telugu Desam working president Revanth Reddy irked Andhra Pradesh Telugu Desam Party leaders along with Telangana TDP.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి