కనబడితే కాళ్ల మీద పడతారు: కేసీఆర్‌పై రేవంత్ సంచలనం, తుగ్లక్ అంటూ ఉత్తమ్

శుక్రవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చేసిన గవర్నర్ ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,

హైదరాబాద్: శుక్రవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చేసిన గవర్నర్ ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే జానా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలున్నాయని ఆరోపించారు.

గవర్నర్ ప్రసంగానికి ఆమోదం ఉందా?

గవర్నర్ ప్రసంగానికి ఆమోదం ఉందా?

మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయకుండా గవర్నర్ ప్రసంగానికి ఆమోదం ఎలా ఆమోదం చేశారని, అసలు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆమోదం లేని ప్రసంగాన్ని గవర్నర్ ఎలా చదివారని అన్నారు. మంత్రులు సంతకం చేయకుండా ప్రసంగం చదివించి.. గవర్నర్ వ్యవస్థనే అవమాన పర్చారని ఆరోపించారు. గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.

హామీల ప్రస్తావనేది..

హామీల ప్రస్తావనేది..

గవర్నర్ ప్రసంగంలో మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ముస్లింలకు రిజర్వేషన్ల ప్రస్తావనే లేదని అన్నారు. 30రోజులపాటు సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, 13, 14 రోజులకే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

కనబడితే కాళ్ల మీద పడతారు..

కనబడితే కాళ్ల మీద పడతారు..

రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నడుచుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తప్పిదాలను గమనించాలన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండొద్దని రేవంత్.. గవర్నర్‌కు సూచించారు. కనబడటంతో సీఎం కేసీఆర్.. గవర్నర్ కాళ్ల మీద పడతారని.. ఆ సానుభూతితో ఆశీర్వదించండి కానీ.. ప్రేక్షక పాత్ర పోషించవద్దని గవర్నర్‌ను కోరారు రేవంత్. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా హామీలను చేర్చేలా చూడాలని కోరారు.

అత్యంత శోచనీయమన్న జానా

అత్యంత శోచనీయమన్న జానా

డబుల్ బెడ్రూం ఇళ్లు, మైనార్టీలకు రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ లాంటి అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం అత్యంత శోచనీయమని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జానా రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలను మర్చిపోవడం వల్లే కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసిందని చెప్పారు. ఎన్నికల హామీలను కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు.

అబద్ధాల ప్రసంగం.. తుగ్లక్ పాలన

అబద్ధాల ప్రసంగం.. తుగ్లక్ పాలన

టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ పంపిణీ విషయంలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులే పూర్తయ్యాయని అన్నారు. కొత్తగా ప్రారంభించినవి ఒక్కటీ పూర్తి కాలేదని, వాటితో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కాలేదని చెప్పారు. అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+