రేవంత్: టిడిపిలో వర్కింగ్‌ ప్రెసిడెంట్, కాంగ్రెస్‌లో ఏ పదవి దక్కునో?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్‌రెడ్డికి ఇంకా పార్టీలో ఏ పదవి దక్కలేదు. పీసీసీ కార్యవర్గాన్ని త్వరలోనే పునర్వవ్యస్థీకరించనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే టిడిపిని వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డికి ఇంకా ఏ పదవి దక్కలేదు. రేవంత్‌రెడ్డికి ఏ పదవి ఇస్తారో తనకు తెలియదని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు.

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు 16 మంది కీలక నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే కాంగ్రెస్ పార్టీల రేవంత్‌రెడ్డికి కీలకపదవి దక్కే అవకాశం ఉందని భావించారు. కానీ, రేవంత్‌రెడ్డి కీలక పదవి మాత్రం దక్కలేదు. అయితే కీలకపదవి ఎప్పుడు ఇస్తారనే విషయమై ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ప్రకటించలేదు.

 రేవంత్‌కు కాంగ్రెస్ పార్టీ ఏ పదవిని కట్టబెట్టనుంది

రేవంత్‌కు కాంగ్రెస్ పార్టీ ఏ పదవిని కట్టబెట్టనుంది

రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏ పదవిని కట్టబెట్టనుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి రేవంత్‌రెడ్డికి ఏ హమీ లభించిందో తెలియదు, కానీ, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

  Revanth Reddy Speech at Congress Praja Garjana Meet
   రాహుల్‌గాంధీ పట్టాభిషేకం తర్వాత మారిన పరిస్థితులు

  రాహుల్‌గాంధీ పట్టాభిషేకం తర్వాత మారిన పరిస్థితులు

  రాహుల్‌గాంధీ ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉన్న పీసీసీలను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి మరోసారి దక్కింది. 2019 ఎన్నికల సమయంలో కూడ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీపీ చీఫ్ పదవిలోనే ఉంటారు. అయితే రేవంత్‌రెడ్డితో పాటు ఆయన వర్గీయులకు కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన పదవులు కట్టబెట్టనున్నారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే జిల్లా స్థాయి నేతలకు పీసీసీ కార్యవర్గ కూర్పులో పదవులు దక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.

   టిడిపిలో అలా.. కాంగ్రెస్‌లో ఇలా

  టిడిపిలో అలా.. కాంగ్రెస్‌లో ఇలా

  టిడిపిలో కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి పదవి దక్కలేదు.టిడిపిలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి పదవులు దక్కలేదు. అయితే త్వరలోనే రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.టిడిపిలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్లు భట్టి విక్రమార్క కొనసాగుతున్నాడు కానీ మల్లు భట్టి విక్రమార్కను తప్పించి రేవంత్‌కు ఈ పదవిని కట్టబెట్టే అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రేవంత్

  ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రేవంత్

  టిడిపిలో ఉన్న సమయంలో ఏ రకంగా కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడో కాంగ్రెస్ పార్టీలో కూడ అదే రకంగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రేవంత్‌ విరుచుకుపడుతున్నారు. రానున్న రోజుల్లో కూడ ఇదే తీరులో రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy let go of his working president post in Telangana Telugu Desam Party (TTDP) before joining Telangana Pradesh Congress Committee. He joined the party in the presence of Congress national unit president Rahul Gandhi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X