దళిత నేతలే లక్ష్యం: కొత్త జిల్లాలపై కేంద్ర న్యాయశాఖను ఆశ్రయిస్తాం
హైదరాబాద్: కొత్త జిల్లాల పేరుతో నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రభావం చూపేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, దీనిని కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయ, హోంశాఖ దృష్టికి తీసుకెళతామని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దళిత, గిరిజన నేతలను రాజకీయంగా అణిచివేసే కుట్రతో పాటు, విపక్ష నాయకులను దెబ్బతీసే లక్ష్యంగా, జిల్లాల పునర్‌విభజన ఉందని ఆయన ఆరోపించారు. రాజకీయ స్వార్థంతో చేపడుతున్న విభజన రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట వ్యతిరేకమని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కొనసాగుతుండగానే, జిల్లాల విభజన చేపట్టడంతో, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు గందరగోళంగా మారనున్నాయన్నాని తెలిపారు. తెలంగాణ మేమే తెచ్చామని చెప్పుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాలి కమిటీలకు వినతి పత్రాలను ఇస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications