కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టండి; గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్ పై సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలను నాశనం చేసేలా ఉన్నాయని రేవంత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సిఐ వరప్రసాద్ కు ఫిర్యాదుతోపాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందజేశారు.

Recommended Video

    Revanth Reddy : కేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరిస్తే సహించేది లేదు | Telangana | Oneindia Telugu

     దేశద్రోహుల దేశద్రోహుల కంటే ప్రమాదకరమైన వ్యక్తి కేసీఆర్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి కేసీఆర్

    దేశద్రోహుల దేశద్రోహుల కంటే ప్రమాదకరమైన వ్యక్తి కేసీఆర్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి కేసీఆర్

    అంతర్జాతీయ దేశద్రోహుల కంటే ప్రమాదకరమైన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొని ముఖ్యమంత్రి కేసీఆర్ ను , కెసిఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ప్రచారం చేసిన మీడియా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై, అలాగే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని పోలీసు అధికారులపై కూడా న్యాయస్థానానికి వెళతామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

    కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చెయ్యాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదు

    కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చెయ్యాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదు

    పవిత్రమైన రాజ్యాంగాన్ని అవమానపరిచిన కెసిఆర్ పై తన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి కూడా సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పై దేశ ద్రోహం కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పెద్దలకు పోలీసులు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

    కేసు నమోదు చెయ్యకుంటే న్యాయపోరాటం చేస్తాం

    కేసు నమోదు చెయ్యకుంటే న్యాయపోరాటం చేస్తాం

    కెసిఆర్ పై కేసు నమోదు చేయకుంటే న్యాయ పోరాటానికి దిగుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కెసిఆర్ పై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని, ఆయనను శిక్షించే అంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన నాటి నుండి నిత్యం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగం జోలికి వస్తే రాళ్ళతో కొట్టిస్తాం అని మండిపడ్డారు.

     బీజేపీతో టీఆర్ఎస్ ఎనిమిదేళ్ళ చీకటి సంసారం

    బీజేపీతో టీఆర్ఎస్ ఎనిమిదేళ్ళ చీకటి సంసారం


    బీజేపీతో టిఆర్ఎస్ పార్టీ ఎనిమిదేళ్ల చీకటి సంసారం చేసిందని, ఆ విషయం ప్రజలకు తెలిసిపోయిందేమో అన్న భయంతోనే కెసిఆర్ కేంద్రం పై విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చీకటి ఒప్పందంలో తేడాలు వచ్చాయని అందుకే కెసిఆర్ మోడీ ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయం ప్రజలకు తెలిసి బుద్ధి చెబుతారని భయంతోనే కెసిఆర్ మోడీ పై విమర్శలు గుప్పిస్తున్నారు అని ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనే తప్పని వ్యాఖ్యానించారు.

     కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి

    కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి

    కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగంగా భారత రాజ్యాంగానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నీ ప్రేమ ఉంటే చాలు అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు విమర్శలకు దిగడానికి ఇరువురి మధ్య తేడా వచ్చిన చీకటి ఒప్పందాలు కారణమంటూ కెసిఆర్ ను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+