మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ మార్క్ షాక్.. తగ్గేదేలే!!
తెలంగాణా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ గతంలో పాలన సాగించిన మంత్రులను వదిలిపెట్టటం లేదా? వారిని టార్గెట్ చేస్తూ వారి అవినీతి, అక్రమాలకూ చెక్ పెట్టే ప్లాన్ లో రేవంత్ సర్కార్ ఉందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల పైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే.
గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా కొనసాగిన వారు చేసిన అవినీతి, అక్రమాలను గుర్తుపెట్టుకుని మరీ టార్గెట్ చేస్తూ వారికి వరుస షాకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి కి షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. మాజీ మంత్రి మల్లారెడ్డి, గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తన కళాశాలలకు రోడ్డు వేసుకోవడం కోసం అక్రమాలకు పాల్పడ్డారు.

ఇక ఇదే విషయాన్ని గతంలో రేవంత్ రెడ్డి పదేపదే మల్లారెడ్డి విషయంలో పేర్కొని అప్పుడు మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ని టార్గెట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మంత్రి మల్లారెడ్డి ఆడింది ఆట పాడింది పాటగ సాగింది. ఇక తాజాగా అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తూ మంత్రి మల్లారెడ్డి కి షాక్ ఇచ్చారు.
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో, హెచ్ఎండిఏ లేఅవుట్లో మంత్రి మల్లారెడ్డి ఆక్రమించి కళాశాల కోసం నిర్మాణం చేసిన రోడ్డును నేడు అధికారులు తొలగించారు. అప్పుడు మొత్తం 2500 గజాల భూమిని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి ఆక్రమించుకున్న భూమి వ్యవహారం మరొకమారు తెర మీదకు వచ్చింది. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు హెచ్ఎండిఎ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు.












Click it and Unblock the Notifications