ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే కేసీఆర్ కు షాకిచ్చిన రేవంత్ రెడ్డి!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదేపదే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు చిరాకు కలిగిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది.
తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం మొదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో తాజాగా బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి కి గదుల కేటాయింపు జరిగింది. ఔటర్ లాబీలో రూమ్ నెంబర్ 1,2 లను బీఆర్ఎస్ఎల్పి కి అసెంబ్లీ సచివాలయం కేటాయించడం జరిగింది. గతంలో ప్రతిపక్ష నేతగా జానారెడ్డి, భట్టి విక్రమార్కల కు కేటాయించిన ఛాంబర్ ను బీఆర్ఎస్ కు ప్రస్తుతం కేటాయించలేదు.

ముఖ్యంగా అసెంబ్లీ ప్రతిపక్ష నేత అయిన కెసిఆర్ కు షాక్ ఇస్తూ ఆయన ఛాంబర్ ను మార్చింది రేవంత్ సర్కార్. ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడిగా కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా, ఒక చిన్న రూమును కేటాయించడం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతల ఆగ్రహానికి కారణంగా మారింది. ఇది కావాలని రేవంత్ ప్రభుత్వ కక్షపూరిత చర్యగా, కేసీఆర్ ను అవమానించాలనే ఆలోచనగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సమావేశానికి కెసిఆర్ కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని కేటాయించి, రెండవ సమావేశాల వరకే మార్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు బిజెపి కి రూమ్ నెంబర్ 3, ఎంఐఎం పార్టీకి రూమ్ నెంబర్ 4 లను కేటాయించింది.
39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీ కి మార్చడం పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలలో చర్చ కొనసాగుతుంది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ ను ప్రశ్నించనున్నారు గులాబీ ఎమ్మెల్యేలు.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications