ఆ సాహసం చేస్తారా?: బాబు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే.. రేవంత్ వ్యూహమిదే!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీటీడీపీలో పుట్టిన ముసలం క్లైమాక్స్‌కు చేరినట్టే కనిపిస్తోంది. విదేశీ పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నవేళ.. నాటకీయ పరిణామాల మధ్య రేవంత్‌ను సాగనంపడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది.

చంద్రబాబు క్లియర్: రేవంత్ రెడ్డి ఔట్, రమణ దూకుడు అదే...

  Revanth Reddy VS TDP senior leaders బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా! అదే జరిగితే? | Oneindia Telugu

  పార్టీ తనను దూరం పెట్టబోతుందన్న విషయాన్ని రేవంత్ కూడా ఇప్పటికే గ్రహించాడు. టీడీఎల్పీ నేతగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన అధికారాలకు రమణ కోత పెట్టారంటే.. దాని వెనకాల ఉన్నది చంద్రబాబే అన్నది గ్రహించలేనంత అమాయకుడేమి కాదు రేవంత్.

  ఏంటిదంతా?: రేవంత్‌ను నిలదీసిన రమణ, దబాయింపుగా రేవంత్.., వ్యూహాత్మకమా?

  ఈ నేపథ్యంలో రేవంత్ టీటీడీపీని వీడే పరిణామం ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధినేత చంద్రబాబు రేవంత్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారా?, లేక మాటల్లేకుండానే వేటు వేయడానికి సిద్దపడుతారా? అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

  అపాయింట్‌మెంట్ దొరక్కపోతే?:

  అపాయింట్‌మెంట్ దొరక్కపోతే?:

  అటు రేవంత్ కూడా బాబు విషయంలో ఎలాంటి వైఖరిని అవలంభిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వని పక్షంలో రేవంత్ మరోసారి మీడియా ముందుకు వచ్చే సూచనలున్నాయి. అయితే దీపావళి సందర్భంగా పార్టీ మార్పు లీకులిచ్చి థౌజండ్ వాలా పేల్చినట్టే.. ఇప్పుడు కూడా రేవంత్ సంచలన విషయాలేమైనా బయటపెడుతారా? అన్న చర్చ జరుగుతోంది.

  ఆ సాహసం చేస్తారా?:

  ఆ సాహసం చేస్తారా?:

  ఇన్నాళ్లు పార్టీలో తనకు పూర్తి స్వేచ్చనిచ్చిన చంద్రబాబుపై ఆయన హుందాగానే మాట్లాడబోతున్నారా.. లేక ఓటుకు నోటు కేసు లాంటివి ప్రస్తావించి తనను బలిచేశారని నిందలు వేస్తారా? అన్నది చూడాలి. రాజకీయంగా చంద్రబాబును దగ్గరగా ఎరిగిన వ్యక్తిగా రేవంత్ ఆయన్ను ఎదుర్కొనే సాహసం చేస్తారా? అన్నది కీలకంగా మారనుంది.

  కేసీఆర్ లాంటి ఉద్దండుడినే రాజీకి తీసుకొచ్చి చల్లబర్చిన చంద్రబాబుకు రేవంత్‌ను కట్టడి చేయడం అంత కష్టమేమి కాదనే చెప్పాలి. ఈ విషయం అందరి కన్నా రేవంత్‌కే బాగా తెలుసు కాబట్టి.. బాబు జోలికి వెళ్లేందుకు ఆయన సిద్దపడుతారా అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

   వాళ్లను వదలకపోవచ్చు?:

  వాళ్లను వదలకపోవచ్చు?:

  అధినేత చంద్రబాబు పట్ల రేవంత్ హుందాగానే వ్యవహరించే అవకాశాలున్నాయి కానీ టీటీడీపీలోని సీనియర్లను మాత్రం ఆయన వదిలిపెట్టే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా మోత్కుపల్లి నరసింహులు, అరవింద గౌడ్ లపై రేవంత్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసే అవకాశం లేకపోలేదు. ఆ ఆరోపణలు సంచలనాలు రేకెత్తించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాను పార్టీ వీడే ముందు కచ్చితంగా వారికి గట్టి కౌంటర్సే ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

   ప్రెస్‌మీట్ లో ఏం చెప్తారు?

  ప్రెస్‌మీట్ లో ఏం చెప్తారు?

  రేవంత్ ప్రెస్ మీట్ పెడితే.. తాను టీటీడీపీని వీడటానికి దారితీసిన పరిస్థితుల గురించి పూసగుచ్చినట్టు చెప్పే అవకాశం ఉంది. టీడీపీ నేతల మీద నిందలు వేయడం కన్నా.. తాను టీడీపీని వీడటంలో జనామోదం పొందడానికే రేవంత్ ప్రయత్నించవచ్చు.

  పార్టీ మార్పు లీకులతో ఇప్పటికే నియోజకవర్గంలోని కొంతమంది అనుచరులు టీఆర్ఎస్ వైపు వెళ్లడంతో.. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా రేవంత్ జాగ్రత్తపడవచ్చు. నియోజకవర్గంలోని తన మద్దతుదారులను, అనుచరులను కూర్చోబెట్టి.. తన భవిష్యత్తు కార్యాచరణ గురించి వారికి వివరించి.. ఆ తర్వాతే ఆయన ప్రెస్‌మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana TDP working President Revanth Reddy readying to hold a press meet if Chandrababu rejects his appointment

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి