వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ - టీఆర్ఎస్ పొత్తు: రాహుల్ తో రేవంత్ భేటీ : తేల్చేసారు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందా అంటూ చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్..కేసీఆర్ తమతో కలవచ్చుగా అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. దీని పైన ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న పార్టీ కీలక నేత రాహుల్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ కన్యాకుమారిలో కలిసారు. ఆ తరువాత రేవంత్ టీఆర్ఎస్ తో పొత్తుపైన కీలక వ్యాఖ్యలె చేసారు. టీఆర్ఎస్ తో పొత్తు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

పొత్తు ప్రసక్తే లేదంటూ

పొత్తు ప్రసక్తే లేదంటూ

టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వరంగల్ సభలో రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేసారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ను లేకుండా చేసేందుకే కేసీఆర్ బీజేపీని ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఇప్పుడు అదే బీజేపీ కేసీఆర్ కు సమస్యగా మారిందని రేవంత్ చెప్పుకొచ్చారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో యశ్వంత్ సిన్హా కు సీఎం కేసీఆర్ స్వాగతం పలకటం..ఆయన తొలుత టీఆర్ఎస్ సమావేశంలో పాల్గొనటంతో హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలు కలవలేదు.

ఆ సమయంలో రేవంత్ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్లు తప్పు బట్టారు. అయితే, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

బీజేపీకి కేసీఆర్ అవకాశం ఇచ్చారు

బీజేపీకి కేసీఆర్ అవకాశం ఇచ్చారు

కాంగ్రెస్ తో కలిసే అంశం పైన ఎక్కడా స్పందించకపోయినా.. ఆ పార్టీ పైన గతం కంటే విమర్శల జోరు తగ్గించారు. అదే విధంగా బీజేపీ పైన పోరాటంలో జాతీయ సమావేశాల్లో భాగంగా ఇతర పార్టీలతో కలిసి ఈ రెండు పార్టీలు కార్యాచరణలో భాగస్వాములుగా ఉంటున్నాయి. అయితే, తెలంగాణలో మాత్రం రాజకీయ ప్రత్యర్ధులుగానే ఉంటున్నాయి.

ప్రస్తుతం రాహుల్ తో సమావేవమైన రేవంత్ తెలంగాణలో బారత్ జోడో యాత్ర పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. రాహుల్ యాత్ర మునుగోడు మీదుగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడులో రాహుల్ సభ ఏర్పాటు చేయాలనేది రాహుల్ ఆలోచన.

మునుగోడుకు రాహుల్ వచ్చేలా

మునుగోడుకు రాహుల్ వచ్చేలా

దీని పైనే రాహుల్ తో రేవంత్ చర్చించారని సమాచారం. త్వరలోనే దీని పైన స్పష్టత రానుంది. ఇక, రాహుల్ కు తెలంగాణ లో ఘన స్వాగతం పలికేందుకు రేవంత్ ముందస్తుగానే కసరత్తు ప్రారంభించారు. బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ పోరు రోజు రోజుకీ తీవ్రం అవుతున్న సమయంలో..టీఆర్ఎస్ - కాంగ్రెస్ మైత్రి పైన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. ఇప్పుడు టీపీసీసీ చీఫ హోదాలో రేవంత్ ఆ పొత్తు చర్చలను ఖండించారు. తమ వైఖరి పైన స్పష్టత ఇచ్చారు.

English summary
TPCC Cheif Revanth met congress leader Rahul Gandhi in Knaya kumari. Revanth says no chance for TRS and Congress alliance in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X