బాబు షాక్: రేవంత్ ఎమ్మెల్యే మాత్రమే: ఎల్. రమణ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డిని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా కార్యక్రమాలు చూడొద్దని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. లండన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడారని రమణ చెప్పారు.

  రేవంత్‌రెడ్డిని పదవుల నుండి తొలగిస్తున్నారా?TDLP

  రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: టిడిఎల్‌పిలో ఏం జరుగుతోంది, పార్టీ ఎందుకు వీడుతున్నారు?

  రేపు మధ్యాహ్నం 1 గంటకు గోల్కొండ హోటల్‌లో టీడీఎల్పీ భేటీ జరగనుందని ఎల్. రమణ ప్రకటించారు. ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే హోదాలో పిలుస్తామని తెలిపారు. నేతలంతా పార్టీ మార్గంలో పనిచేసేలా చూడాలని చంద్రబాబు చెప్పినట్లు రమణ గుర్తు చేశారు.

  Revanth Reddy not a TDLP leader says L. Ramana

  రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా చూస్తామని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

  చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి

  అయితే అక్టోబర్ 26న, యధావిధిగా టిడిఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం.మరోవైపు చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చాక అన్ని అంశాలు వివరిస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy not a TDLP leader said TTDP president L. Ramana on Wednesday. We will invite Revanth Reddy for TDLP meeting as a MLA said Ramana.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి