ఇదీ బాబు-కేసీఆర్: కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిన రేవంత్, నా సత్తా ఇలా, ప్రతీ దానికి లెక్క

Posted By:
Subscribe to Oneindia Telugu
Revanth Reddy has praised Sonia Gandhi కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిన రేవంత్ | Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడిన రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై పదేపదే ప్రశంసలు కురిపిస్తున్నారు.

షాకింగ్: రేవంత్ ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ అధికారులు, ఆరా, భేటీకి టీఆర్ఎస్ నేత

తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆయన పదేపదే చెబుతున్నారు. అదే సమయంలో కొందరు ఏపీ, టీడీపీ నేతలు.. కేసీఆర్ నుంచి లబ్ధి పొందుతున్నారని అందుకే టీడీపీని వీడుతున్నట్లు చెప్పారు.

పదేపదే చంద్రబాబుకు రేవంత్ ప్రశంసలు

పదేపదే చంద్రబాబుకు రేవంత్ ప్రశంసలు

రేవంత్ పదేపదే చంద్రబాబును ప్రశంసిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను పక్కన పెడితే, ఈ ప్రశంసలు ఏపీ కాంగ్రెస్‌కు, వైసిపికి ఇబ్బందికర పరిణామాలని చెప్పవచ్చు. నిత్యం బాబుకు కితాబివ్వడం ద్వారా ఏపీ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు

కాంగ్రెస్ నేతల భేటీలోనే కితాబు

కాంగ్రెస్ నేతల భేటీలోనే కితాబు

సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి అభిమానులు, అనుచరులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. చంద్రబాబును ఆకాశానికెత్తారు. చంద్రబాబుతో పదేళ్ల అనుబంధం కారణంగానే ఆయనను పదేపదే ప్రశంసిస్తున్నారని భావించవచ్చు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశంసించారు.

బాబుకు ప్రధాని అయ్యే అవకాశమొచ్చినా

బాబుకు ప్రధాని అయ్యే అవకాశమొచ్చినా

గతంలో ఏపీ సీఎం నారా చంద్రనాయుడుకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తెలుగు ప్రజల కోసం ఆ పదవిని చేపట్టలేదన్నారు. కానీ తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్షంలో ఎందుకంటే

ప్రతిపక్షంలో ఎందుకంటే


ప్రజలకు పని చేసేందుకు ప్రతిపక్షంలో ఉంటే మంచిదనే ఉద్దేశ్యంతోనే తాను 2006లో టీడీపీలో చేరానని రేవంత్ రెడ్డి చెప్పారు. తద్వారా ఇప్పుడు కూడా ప్రజల కోసం తాను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన సత్తా ఏమిటో చెప్పారు

తన సత్తా ఏమిటో చెప్పారు

కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరైన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పరోక్షంగా తన సత్తా ఏమిటో కూడా చెప్పారు. తాము 50 రోజుల్లో టీడీపీలో 10 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను చేర్చామని చెప్పారు. నిన్నటి దాకా తెలంగాణలో టీడీపీ అంటే రేవంత్ రెడ్డే. ఆయన కారణంగానే సభ్యత్వ నమోదు ఎక్కువయిందని భావిస్తారు. రేవంత్ కూడా ఇప్పుడు తన సామర్థ్యాన్ని కాంగ్రెస్ నేతల సాక్షిగా చెప్పారు.

సోనియా గాంధీకి కితాబు

సోనియా గాంధీకి కితాబు

రేవంత్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రజల కష్టాలు గుర్తించి, ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారని ప్రశంసించారు. తెలంగాణ రాగానే కేసీఆర్ వెళ్లి సోనియాను కలిశారని గుర్తు చేశారు. కాను తాను కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revanth Reddy has praised Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and AICC president Sonia Gandhi on Monday.
Please Wait while comments are loading...