వైఎస్, కేవీపీ తరానికొక్కరు-ఇప్పుడంతా కుర్చీ..! రేవంత్ సంచలనం..!

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం పాలైన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుంగు అనుచరుడు కేవీపీ రామచంద్రరావును ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. వారిద్దరిని ఆకాశానికెత్తేస్తూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఇవాళ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వైెఎస్సార్ స్మారక అవార్డుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా వారిద్దరూ ఎలాంటి వారో గుర్తుచేసుకున్నారు. ఈ తరానికి వైఎస్‌ ఒక్కరే, కేవీపీ ఒక్కరే అంటూ వారిని ఆకాశానికెత్తేశారు. కేవీపీలాంటి వారు తనకు ఎక్కడా కనిపించలేదన్నారు. కేవీపీలా ఉండాలంటే సర్వం త్యాగం చేయాలన్నారు. కొందరు తన దగ్గరకు కేవీపీలా ఉంటామని వస్తారని, ఎవరినైనా మొదటివారం లోపలికి రానిస్తే.. రెండో వారం తన కుర్చీలో కూర్చుంటానంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవంతో ఈ విషయం చెబుతున్నట్లు తెలిపారు.

Revanth Reddy Praises Late CM YSR and KVP Recognizes Them as Unique Leaders of Their Era

అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మిత్రులు వస్తారని, అధికారం మాయమైనప్పుడు మిత్రులు మాయమైపోతూ ఉంటారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ కేవీపీ.. చదువుకునే రోజుల నుంచి వైఎస్‌ మరణం వరకు తోడుగా ఉన్నారన్నారు. వైఎస్‌ ఆలోచనలు కేవీపీ కొనసాగిస్తున్నారని సీఎం రేవంత్‌ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. వైఎస్సార్ సైతం ఆరోపణలు తనపై వేసుకుని, మంచి జరిగితే ఆ క్రెడిట్ కేవీపీకి ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. స్నేహానికి, పాలనకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనమని, ఆయన స్ఫూర్తితోనే తాము ఆయన ఆశయాలతో పాలన కొనసాగిస్తున్నట్లు రేవంత్ తేల్చేశారు.

Revanth Reddy Praises Late CM YSR and KVP Recognizes Them as Unique Leaders of Their Era

వైఎస్సార్ రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, సీఎంలు మారినా ఆయన పథకాలు మార్చే సాహసం చేయని విధంగా వాటికి ఆయన రూపకల్పన చేశారని రేవంత్ గుర్తుచేశారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే తాము ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సన్నబియ్యం పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వైఎస్ హామీ ఇచ్చిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఆయన ఆలోచనలకు అనుగుణంగానే నిర్మించి తీరుతామని రేవంత్ మరో సంచలన ప్రకటన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+