ఢిల్లీకి చేరిన రేవంత్, అనుచరుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు, హుటాహుటిన సీతక్క

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఆత్మీయుల మాట..ముచ్చట : ఆత్మబలిదానాలతో తెలంగాణా : రేవంత్‌రెడ్డి | Oneindia Telugu

  హైదరాబాద్: రేవంత్ రెడ్డి మంగళవారం ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో రేవంత్‌‌తోపాటు కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరతారు.

  రేవంత్‌పై ఎమ్మెల్యే కృష్ణారావు సంచలనం, నేనూ అతని వెంటే.. బాబుకు శశికళ లేఖ

  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు ఏఐసీసీ నేతలు పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢీల్లీకి చేరుకున్నారు.

  రేవంత్ అనుచరుల ఇళ్లలో తనిఖీలు

  రేవంత్ అనుచరుల ఇళ్లలో తనిఖీలు

  కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాదులో నిర్వహిస్తున్న సమావేశానికి ఎంతమంది వెళ్లారనే విషయమై కనుక్కునేందుకు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఆయన అనుచరుల ఇళ్లను తనిఖీ చేశారు.

   వారి వాహనాలు నిలిపివేశారు

  వారి వాహనాలు నిలిపివేశారు

  పలు ప్రాంతాల్లో ఆయన అనుచరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి పలువురి వివరాలను పోలీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాదులో నిషేదాజ్ఞలు ఉన్నాయని, భారీగా వాహనాలు వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు పలువురు కార్యకర్తల వాహనాలను కూడా నిలిపేశారు.

   బాబుకు రాజీనామా, హుటాహుటిన ఢిల్లీకి

  బాబుకు రాజీనామా, హుటాహుటిన ఢిల్లీకి

  తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెబుతూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే సీతక్క మంగళవారం ఉదయం టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఆమె హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు.

   వీరు కాంగ్రెస్ పార్టీలోకి

  వీరు కాంగ్రెస్ పార్టీలోకి

  తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే, రాజకీయ ఏకీకరణ తప్పదని సీతక్క ఈ సందర్భంగా అన్నారు. కాగా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్‌తో పాటు సీతక్క, అరికెల నర్సింహా రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

   రేవంత్ రెడ్డి షెడ్యూల్

  రేవంత్ రెడ్డి షెడ్యూల్

  మంగళవారం ఉదయం తనను కలిసి మద్దతు తెలిపేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ రేవంత్ బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాహుల్ గాంధీని కలుసుకునే రేవంత్ దాదాపు గంట సేపు ఆయనతోనే ఉండనున్నారు.

   వీలైతే సోనియాను కలిసే అవకాశం

  వీలైతే సోనియాను కలిసే అవకాశం

  వీలైతే రేవంత్, సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారని తెలుస్తోంది. రాహుల్ తోనే కలసి ఆయన మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఆపై సాయంత్రం నాలుగు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాహుల్ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం రాత్రికి హైదరాబాద్ వస్తారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kodangal MLA Revanth Reddy reached Delhi on Monday night to join Congress party and TDP leader and former MLA Seethakka resign to Telugu Desam Party.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి