వైఎస్ జగన్ ట్వీట్ కు రేవంత్ రెడ్డి రిప్లై
తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన జగన్‌కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావంతో మెలుగుతామని, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
'శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం... అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.' అని ట్విట్టర్‌లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఇతర మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి పాలన విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకొని పరిశీలించారు. ఆ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.












Click it and Unblock the Notifications