వారిని కాపాడేందుకే సబర్వాల్‌ను పంపిచేస్తున్నారు: డ్రగ్స్ కేసుపై రేవంత్ ఫైర్
సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను ఉద్దేశ పూర్వకంగానే విచారణ నుంచి తప్పిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను ఉద్దేశ పూర్వకంగానే విచారణ నుంచి తప్పిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే ఆయన సెలవులను రద్దు చేసి కేసు పూర్తి అయ్యే వరకు విచారణ అధికారిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులను ఈ కేసు నుంచి తప్పించేందుకే అకున్ సబర్వాల్ ను సెలవుపై పంపిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

విచారణ జరిగే సందర్భంలోనే ఆయన సెలవుపై వెళ్లడం ఒత్తిళ్లకు నిదర్శనమని అన్నారు. కాగా, అకున్ సబర్వాల్ 10రోజులపాటు సెలవుపై వెళ్లనున్న విషయం తెలిసిందే. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, కేసు విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని అకున్ సబర్వాల్ తెలుపడం గమనార్హం.
ఎల్లుండి నుంచి జులై 27 వరకు తాను సెలవులపై వెళ్తున్నట్లు అకున్ సబర్వాల్ తెలిపారు. తన వ్యక్తిగత పనులపైనే సెలవులు తీసుకున్నానని తెలిపారు. కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సంబంధమున్న మరికొంత మందికి త్వరలోనే నోటీసులు పంపనున్నారు. నోటీసులు అందుకున్న వారు వారికి కేటాయించన రోజున హాజరై వివరణ ఇవ్వాలని అన్నారు.












Click it and Unblock the Notifications