హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్‌పై ప్రశ్నల వర్షం, భార్యను బ్యాంక్‌కు తీసుకెళ్లిన అధికారులు: హాంకాంగ్‌లో ఖాతా, ఎవరీ మురళి?

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్‌ భార్యను బ్యాంక్‌కు తీసుకెళ్లిన అధికారులు..!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు శుక్రవారం కూడా కొనసాగాయి. గురువారం రాత్రి ఇంటికి చేరుకున్న రేవంత్‌ను అధికారులు ఓవైపు ప్రశ్నిస్తూ, మరోవైపు అన్ని పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఆయనను 19 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఏ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీసే ప్రయత్నాలు చేశారు.

మరోవైపు, రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డిని ఐటీ అధికారులు కొందరు బ్యాంకుకు తీసుకు వెళ్లారు. ఆమెతో బ్యాంకు లాకర్లను తెరిపించారు. గీత సమక్షంలో పత్రాలను పరిశీలించారు. బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్సుఫర్ అయిన మొత్తాలను పరిశీలించారు. ఎప్పుడెప్పుడు ఎంత వచ్చిందో చూశారు. మొత్తం మూడు బ్యాంకుల్లో లాకర్ల వివరాలను తెలుసుకున్నారు.

ఇదే నా చివరి స్పీచ్ కావొచ్చు, జైలు నుంచి నామినేషన్: రేవంత్ ఉద్వేగం, హైదరాబాద్‌లో ఇంటికి రాకఇదే నా చివరి స్పీచ్ కావొచ్చు, జైలు నుంచి నామినేషన్: రేవంత్ ఉద్వేగం, హైదరాబాద్‌లో ఇంటికి రాక

ఐటీ శాఖకు చూపిన వివరాల్లో తేడాలి

ఐటీ శాఖకు చూపిన వివరాల్లో తేడాలి

జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి నుంచి ఈడీ అధికారులు రూ.కోటిన్నర నగదు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై రేవంత్ నుంచి ఆరా తీశారని తెలుస్తోంది. బంగారు నగలపై బిల్లులు అడగ్గా.. పూర్వీకుల నుంచి వచ్చినట్లు చెప్పారని తెలుస్తోంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన సోదాలు శుక్రవారం మధ్యాహ్నం కూడా కొనసాగుతున్నాయి. రేవంత్‌కు చెందిన స్థిర, చరాస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. రేవంత్ ఆధాయానికి సంబంధించి ఐటీ శాఖకు చూపిన వివరాల్లో తేడాలు గుర్తించారని సమాచారం.

రేవంత్ పైన ప్రశ్నల వర్షం

రేవంత్ పైన ప్రశ్నల వర్షం

రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి నివాసాల్లో జరిగిన సోదాలు ముగిశాయి. ఉదయ్ సిన్హాను ఎదుట ఉంచి రేవంత్‌ను అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. రేవంత్ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది.

ఓటుకు నోటు రూ.50 లక్షలు ఎక్కడివి, హాంకాంగ్ ఖాతా

ఓటుకు నోటు రూ.50 లక్షలు ఎక్కడివి, హాంకాంగ్ ఖాతా

రేవంత్ పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడివో తేల్చే ప్రయత్నాలు కూడా ఐటీ అధికారులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా విచారించగా రేవంత్ ఆస్తులు, ఆయన బ్యాంక్ ఖాతాలపై ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. హాంకాంగ్‌లో ఖాతా ఉందని తేలింది.

రూ.9 కోట్లు డిపాజిట్ చేసిన రఘువరన్ మురళి ఎవరు?

రూ.9 కోట్లు డిపాజిట్ చేసిన రఘువరన్ మురళి ఎవరు?

రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హవాలా మార్గంలో రూ.కోట్లు వచ్చినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. 2014 ఫిబ్రవరి 25న బ్యాంక్ నుంచి రఘువరన్ మురళి ఒకేరోజున రూ.9 కోట్లు రేవంత్ అకౌంట్లో జమ చేశారు. కౌలాలంపూర్ ఆర్‌హెచ్‌బీ బ్యాంక్ ఖాతా నుంచి ఈ డబ్బు వచ్చింది. ఆ డబ్బు రేవంత్‌కు అందింది. విదేశాల లావాదేవీల్లో కౌలాలంపూర్ రఘువరన్ మురళీకి రేవంత్‌కు మధ్య చాలా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా హవాలా రూపంలో దుబాయ్ నుంచి సొమ్మును పొందినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ విదేశీ ఆర్థిక లావాదేవీలు అన్నీ 2014 ఎన్నికలకు ముందే జరిగాయి. వాటిని ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చినట్లు కూడా గుర్తించారని తెలుస్తోంది. ఇన్ని ఆస్తులు, పెట్టుబడులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
Congress leader and Kodangal former MLA Revanth Reddy's wife Geetha opens bank lockers in the presence of IT officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X