కేటీఆర్ సవాల్‌పై రేవంత్ ఆగ్రహం: కేసీఆర్‌కు కాంగ్రెస్ చిక్కు ప్రశ్నలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెరాస అధికారంలోకి వస్తే కుర్చీ వేసుకొని ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తానని గతంలో చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కెసిఆర్ తన హామీని మరిచిపోయి ఇప్పుడు ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాకు రూ.1000 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చునని చెప్పారు. కమీషన్లకు కక్కుర్తిపడి కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టారన్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్త నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల వర్షం
పాలేరు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అధికార తెరాస పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిడిపి, వైసిపిలు మద్దతివ్వడాన్ని తెరాస తప్పుపడుతోంది. దీనికి రేవంత్ రెడ్డి ఇటీవలే ధీటుగా స్పందించారు. కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందించింది.
నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి పాలేరులో ఎందుకు పోటీ చేస్తుందని తెరాస ప్రశ్నించింది. దానికి టిడిపి నేత రేవంత్ మాట్లాడుతూ.. తమను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అడగలేదని, కానీ పాలేరు ఎన్నికలకు మాత్రం విజ్ఞప్తి చేసిందని చెప్పారు.
ఇక, కాంగ్రెస్ పార్టీకి విసిరిన తెరాస ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించింది. 2014 ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా పోటీ చేశారని ప్రశ్నించారు.
దీనికి కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ... ఉత్తమ్ కుమార్ రెడ్డి.. శంకరమ్మ పైన పోటీ చేయలేదని, ఉత్తమ్ సిట్టింగ్ స్థానంలో తెరాసనే శంకరమ్మను బరిలోకి దింపారన్నారు. అసలు శంకరమ్మ గారు సిరిసిల్ల సీటు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదని తెరాసను ప్రశ్నించారు.
తుమ్మల నాగేశ్వర రావు వంటి తెలంగాణ ద్రోహులను ఎమ్మెల్సీగా చేసి, పదవులు కట్టబెట్టిన కేసీఆర్.. శంకరమ్మను ఎమ్మెల్సీగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చారని, కానీ శ్రీకాంత చారి తల్లి శంకరమ్మను ఓడిపోయే చోట పోటీ చేయించారని చెప్పారు.
ఇక, రాంరెడ్డి వెంకట రెడ్డికి చికిత్స చేయించామనడంపై మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్స ప్రభుత్వం బాధ్యత అన్నారు. ప్రభుత్వ వైద్య సాయం ఆయన హక్కు అన్నారు. దానిని కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అన్నారు. తమ ప్రశ్నలకు తెరాస సమాధానం చెబుతుందా అని సవాల్ చేస్తున్నారు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications