కెటిఆర్ వస్తే నేను, కెసిఆర్ వస్తే చంద్రబాబు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కొడుకు కాకపోతే తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికీ కూడా కెటిఆర్ అర్హుడు కాదని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున కెటిఆర్ ప్రచారం చేస్తే టిడిపి నుంచి నేను వస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. టిఆర్ఎస్ నుంచి కెసిఆర్ వస్తే టిడిపి నుంచి చంద్రబాబు వస్తారన్నారు. మేయర్‌ ప్రత్యక్ష ఎన్నికపై మంత్రి కెటిఆర్ మంత్రివర్గం సమావేశంలో ప్రతిపాదన పెట్టి ఒప్పించాలని ఆయన అన్నారు. తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపింది ఎన్టీఆరేనని ఆయన చేశారు. ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

 Revanth Reddy says KTR is not qualified even to Chaprasi post

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రావాళ్లది పేడ బిర్యాని అన్నారని, అమరావతి వెళ్లి సీఎం కేసీఆర్‌ ఆ బిర్యానే తిన్నారని అన్నారు. బీజేపీతో పొత్తు పెద్దలు కుదిర్చిన పెళ్లి అని అభివర్ణిస్తూ ఒకట్రెండు ఇబ్బందులున్నా సర్దుకుపోవాలని సూచించారు. 7.9 లక్షల ఓట్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆయన అన్నారు. ఆ తర్వాతే ఆంధ్రోళ్ల ఓట్లడిగే అర్హత టీఆర్‌ఎస్‌కు ఉంటుందని రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఇదిలావుంటే, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చీమూ నెత్తురుంటే వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు పెంచాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+