వందేమాతరం చెప్పరు కానీ..: రేవంత్, తలసానికి షాక్
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ నుండి తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. పైశాచిక ఆనందం కోసం తమను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు తమను సభ నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు.
సస్పెన్షన్ పైన పునరాలోచన చేయకుంటే పోరాడానికి సిద్ధమని చెప్పారు. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగా తమను సస్పెండ్ చేశారన్నారు.
సోమవారం నాడు రేవంత్ రెడ్డి తెరాస పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం సమయంలో తమ పార్టీ సభ్యుల పైన దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ గీతం అంటే తమకు గౌరవం ఉందని, దాని విషయంలో తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమాపణ చెప్పేందుకైనా సిద్దమన్నారు. తాము తప్పు చేయలేదన్నారు.

జాతీయగీతం విషయంలో మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ తమకు సుద్దులు చెప్పడం విడ్డూరమన్నారు. పాకిస్తాన్‌కు పారిపోయిన కాశీం రజ్వీ స్థాపించిన పార్టీ మజ్లిస్ అని ధ్వజమెత్తారు. మజ్లిస్ పార్టీ ఎప్పుడు కూడా వందేమాతరం పాడదని, అలాంటి వారు తమకు సుద్దులు చెప్పడమేమిటన్నారు. వందేమాతరాన్ని వారు గౌరవించరన్నారు. వారు తమకు బుద్ధులు చెప్పడం విడ్డూరమన్నారు.
మండలిలో తలసానికి చుక్కెదురు
శాసన మండలిలో తెరాస మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా.. టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తలసాని సమాధానం వినకుండా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ నర్సా రెడ్డిలు వాకౌట్ చేశారు. తలసాని ఎప్పుడు సమాధానం చెప్పినా తాము ఇలాగే నిరసన తెలుపుతామని చెప్పారు. కాగా, తలసాని టీడీపీ తరఫున గెలిచి తెరాసలో చేరి మంత్రిగా అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications