వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ కు ఓటు వెయ్యాలన్న రేవంత్ రెడ్డి ? .. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నాడు వైరల్ గా మారిన వీడియో

|
Google Oneindia TeluguNews

Recommended Video

Revanth Reddy Requested People To Vote TRS In Muncipal Elections ! || Oneindia Telugu

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సమయంలో ఒక వీడియో తెలంగాణాలో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది . తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అయిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వెయ్యాలని పిలునివ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది.టీఆర్ఎస్ పార్టీ అంటేనే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కు ఓటు వేయమని చెప్పటం నమ్మశక్యం కాని విషయం .

దేశంలోనే తొలిసారి .. తెలంగాణా మున్సిపోల్స్ లో దొంగ ఓట్లకు చెక్ పెట్టే ఫేస్ రికగ్నిషన్ యాప్దేశంలోనే తొలిసారి .. తెలంగాణా మున్సిపోల్స్ లో దొంగ ఓట్లకు చెక్ పెట్టే ఫేస్ రికగ్నిషన్ యాప్

వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసి, అన్ని డివిజన్లలో, అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీని గెలపించాలని పదేపదే చెబుతున్నాం అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు . అయితే, రేవంత్ రెడ్డి నోటి వెంట ఈ మాట పొరపాటున వచ్చిందా? లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా ఎడిట్ చేసి ఎన్నికల పోలింగ్ నాడు కావాలని వైరల్‌ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది .

Revanth Reddy says to vote for TRS? A video went viral in social media on municipal election polling day

రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఓ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది నిజమో అబద్దమో తెలీక జనం తెగ చర్చలు పెడుతున్నారు. ఇక మరోపక్క తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ సమయంలో ఇలాంటి ప్రచారం టీఆర్ఎస్ కు లాభిస్తుందని, అందుకే ఈ వీడియో వైరల్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది కావాలని చేసిన పని అని మండిపడుతున్నారు.

English summary
Revanth Reddy, who set up a press meet during the municipal election, said he had made shocking remarks that he had repeatedly said that he was looking for effective leadership and to win the TRS party in all divisions and all wards. However, did the word come across Revant Reddy? Or is someone intentionally editing and going viral on election polls? Is to be known.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X