మంత్రి లక్ష్మారెడ్డికి కౌంటర్: జడ్చర్లలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని డాక్టర్ కాదంటూ వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను జడ్చర్ల మండల టీఆర్ఎస్ నాయకులు సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగింపు చేసిన టీఆర్ఎస్ నేతలు ఎమ్మల్యే రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ 1994లో రేవంత్ రెడ్డి ఏం చేశారో బహిర్గత పరచాలని, ఆ తర్వాత ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన తమ నాయకుడిపై రేవంత్ మరోసారి నోరు జారితే సహించేది లేదని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి చదువు ఎంబీబీఎస్‌కు తక్కువ, ఆర్ఎంపీకి ఎక్కువ అనేలా ఉందన్నారు.

హైదరాబాదు కర్నాటక ఎడ్యుకేషనల్ సొసైటీ 1981లో ప్రారంభమైతే 1987లో గుర్తింపు వచ్చిందన్నారు. 2004 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో 1988లో బిహెచ్ఎంఎస్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారని, సంబంధిత పత్రాలను రేవంత్ రెడ్డి చూపించారు. ఆయన ఎప్పుడు పూర్తి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు.
1987లో కళాశాలకు గుర్తింపు వస్తే బిహెచ్ఎంఎస్ అదే సంవత్సరం ఎలా పూర్తవుతుందని మంత్రి లక్ష్మా రెడ్డికే తెలుసునని చెప్పారు. లక్ష్మారెడ్డి వైద్యునిగా ప్రాక్టీస్ చేస్తే ఆయుష్ దగ్గర కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దగ్గర కానీ తన పేరును నమోదు చేయించుకున్నారా చెప్పాలని అన్నారు.












Click it and Unblock the Notifications