ప్రగతి భవన్ ను పేల్చేయ్యండి.. పాదయాత్రలో రేవంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలను లోపలికి రానివ్వని ప్రగతి భవన్ అవసరమా అని పేర్కొన్న ఆయన మావోయిస్టులు ఆ పని చెయ్యాలన్నారు.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పాదయాత్రలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పై, తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చివేయాలంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దొరల గడిలను కూల్చివేసిన మావోయిస్టులు ప్రగతి భవన్ ని కూడా కూల్చివేయాలంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉంటే ఏంటి.. లేకుంటే ఏంటి అంటూ పేర్కొన్న ఆయన అందుకే మావోయిస్టులు డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ ని పేల్చివేస్తే మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే ప్రగతిభవన్లోకి ప్రవేశం
సీఎం కేసీఆర్ 2000 కోట్ల రూపాయలతో 120 గదులతో ప్రగతి భవన్ హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రగతిభవన్లోకి సామాన్యుల ప్రవేశం లేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఆంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే ప్రగతిభవన్లోకి ప్రవేశం ఉంటుందంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇక ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒక సన్నాసి, డ్రామారావు అంటూ విమర్శలు గుప్పించారు.

కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రం మొత్తం మా కుటుంబం అని చెబుతున్న కేటీఆర్ ఒక సన్నాసని, అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎక్కడున్నాడు అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేటీఆర్ చదువుకుంది గుంటూరులో అని, చిప్పలు కడిగింది అమెరికాలో అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ద్రోహులంతా పదవులలో ఉన్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమకారులకు ఏ ఒక్కరోజైనా బువ్వ పెట్టాడా?
ఉద్యమకారులను ఎమ్మెల్యేనో.. ఎమ్మెల్సీనో... చేశారా అంటూ ప్రశ్నించిన ఆయన కెసిఆర్ తెలంగాణ ఉద్యమకారులకు ఏ ఒక్కరోజైనా బుక్కెడు బువ్వ పెట్టాడా? అని ప్రశ్నించారు. కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి ప్రగతి భవన్ ను పేల్చేయాలని రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను, ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటానికి రేవంత్ రెడ్డి పాదయాత్రను చేస్తున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రని తెలంగాణాలో మొదలు పెట్టి రచ్చ చేస్తుంది.












Click it and Unblock the Notifications