అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోంది.. సమాధానం చెప్పే దమ్ముందా కేసీఆర్? రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేడు ఆవిష్కరించనున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానని చెప్పి కెసిఆర్ మోసం చేశాడని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేశారు.
అనేక సందర్భాల్లో కేసీఆర్ దళితుల కోసం ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పిన వీడియోలను, ఆయన దళితుల కోసం ఇచ్చిన హామీలను పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి దళితుల కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు దళిత ముఖ్యమంత్రి జాడేలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చింది లేదని కెసిఆర్ దళితులకు అడుగడుగున అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అంబేద్కర్ ను గౌరవించడం అంటే ఎన్నికల ముందు విగ్రహాన్ని కట్టి జబ్బలు చరచుకోవడం కాదని, నిలువెత్తు దండలు వేసి చప్పట్లు కొట్టడం అంతకన్నా కాదని పేర్కొన్న రేవంత్ రెడ్డి అంబేద్కర్ ను గౌరవించడం అంటే అణగారిన వర్గాలకు అండగా నిలవడం అన్నారు బడుగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనలో నడవడం అని వెల్లడించారు.

ఇక ఇదే సమయంలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కెసిఆర్ తీరుతో అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. నిలువెత్తు విగ్రహం నిలదీస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దళిత బిడ్డల కాలేకడుపుల సంగతేంటని కెసిఆర్ ను ప్రశ్నించారు. దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న ద్రోహి ఎవరని కెసిఆర్ ను నిలదీశారు.
🔥అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోంది..
— Revanth Reddy (@revanth_anumula) April 14, 2023
నిలువెత్తు విగ్రహం నిలదీస్తోంది..
🔥దళిత బిడ్డల కాలే కడుపుల సంగతేంటని?
🔥దళితుడే తొలి ముఖ్యమంత్రన్న ద్రోహి ఎవరని?
🔥దళిత బిడ్డలకు మూడెకరాల భూమేదని?
🔥దళిత బంధు వచ్చిందెవరికి అని?
🔥సబ్ ప్లాన్ నిధులు ఏ పద్దుల కింద మాయమైపోయాయని?
సమాధానం చెప్పే… pic.twitter.com/3b1sJYxIlU
దళిత బిడ్డలకు మూడు ఎకరాల భూమి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దళిత బంధు వచ్చింది ఎవరికో చెప్పాలంటూ నిలదీశారు. సబ్ ప్లాన్ నిధులు ఏ పద్దుల కింద మాయమైపోయాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెప్పే దమ్ము కెసిఆర్ కు ఉందా అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications