• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేటీఆర్ నా వెంట్రుకతో సమానం-అలా అయితేనే అన్నీ బయటపడుతాయి-నిప్పు లేనిదే పొగ రాదు:'డ్రగ్స్' ఇష్యూపై రేవంత్

|

డ్రగ్స్ వినియోగంపై వైట్ ఛాలెంజ్ విసిరితే మంత్రి కేటీఆర్ ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గన్‌పార్క్ వద్దకు తనకన్నా అరగంట ముందే వచ్చి సవాల్ స్వీకరిస్తాడనుకుంటే... ఉదయం నుంచి తనపై తిట్ల దండకం అందుకున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కూడా తనతో వస్తే ఢిల్లీ ఎయిమ్స్‌లో కలిసి టెస్టులు చేయించుకుంటామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. రాహుల్ కూడా అందుకు సిద్ధపడితే... అప్పుడు ఇవాంకా ట్రంప్ రావాలంటేడేమోనని ఎద్దేవా చేశారు.కేటీఆర్‌ను తాను సూటిగా ఒకటే అడుగుతున్నానని... వైట్ ఛాలెంజ్‌తో రాష్ట్ర యువతకు ఆదర్శంగా ఉందామని మరోసారి పిలుపునిచ్చారు. సోమవారం(సెప్టెంబర్ 20) గన్‌పార్క్ వద్ద రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

స్కూళ్లలో గంజాయి అమ్ముతున్నారు : రేవంత్ రెడ్డి

స్కూళ్లలో గంజాయి అమ్ముతున్నారు : రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్ యువకులకు ఆదర్శంగా ఉన్నాడని పదేపదే చెప్పుకుంటారు... తెలంగాణలో దాదాపుగా స్కూళ్లు,కాలేజీల్లో 40లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.హైదరాబాద్‌లో ప్రముఖుల పిల్లలు చదువుకునే స్కూళ్లతో పాటు మధ్యతరగతి పిల్లలు చదువుకునే పాఠశాల్లో డ్రగ్స్,గంజాయి విక్రయిస్తున్నారు.రాత్రిపూట జరిగే పార్టీలకు ప్రభుత్వమే అనుమతి ఇస్తోంది.డ్రగ్స్ వినియోగంపై ఎక్సైజ్ శాఖ నివేదికలు ప్రభుత్వానికి అందుతున్నాయి.పాఠశాల్లలో ఇంత వేగంగా డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తుంటే లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీపై లేదా.దీనికి సమాధానం చెప్పకపోగా నాపై ఎదురుదాడి చేస్తారా. నన్ను థర్డ్ రేట్ క్రిమినల్... చర్లపల్లి బ్యాచ్ అని విమర్శలు చేస్తున్నారు. ఎవరు నేరగాళ్లు... ఎవరేంటో చర్చ చేస్తే డ్రగ్స్ అంశం పక్కకు పోతుంది. తాతలు,తండ్రులపై ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కేటీఆర్‌ను సూటిగా అడుగుతున్నా... : రేవంత్ రెడ్డి

కేటీఆర్‌ను సూటిగా అడుగుతున్నా... : రేవంత్ రెడ్డి

'నేను కేటీఆర్‌ను సూటిగా అడుగుతున్నా.. నేనేమీ ఆయన ఆస్తులు,ఫాంహౌస్‌లు అడగలేదు.తెలంగాణ యువకులకు రాష్ట్ర ప్రజాప్రతినిధులుగా ఆదర్శంగా ఉందామని చెబుతున్నా.ఇందుకోసం మన రక్తం,వెంట్రుకల నమూనాలను డ్రగ్స్ పరీక్షల కోసం ఇద్దామంటున్నా. ఇటీవలే మీడియాతో చిట్‌చాట్‌లో... డ్రగ్స్‌తో నాకే సంబంధం... నా రక్తమిస్తా... నా వెంట్రుకలిస్తా... నా నిజాయితీని నిరూపించుకుంటానని కేటీఆరే అన్నారు. కేటీఆర్ ఇంత ఆదర్శంగా ఉన్నప్పుడు.. నేను వెనక్కి తగ్గితే యువకులకు అనుమానం వస్తది కాబట్టి... నేను వైట్ ఛాలెంజ్ విసిరాను. గన్‌పార్క్ వద్దకు వస్తే ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని ప్రజలకు ఆదర్శంగా ఉందామని అన్నాను.కేటీఆర్‌తో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి స్పోర్టివ్‌గా ఛాలెంజ్ విసిరాను.కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి రాగా కేటీఆర్ ఎందుకు రాలేదో తెలంగాణ యువతే ఆలోచించుకోవాలి.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

నిప్పు లేనిదే పొగ రాదు : రేవంత్ రెడ్డి

నిప్పు లేనిదే పొగ రాదు : రేవంత్ రెడ్డి


హీరో రానా,హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ కేసు విచారణకు ఈడీ అధికారులు పిలిచారు.వాళ్లు నేరాలకు పాల్పడ్డారా లేదా అనేది మాకు తెలియదు. అయితే పొగ లేనిదే నిప్పు వస్తదా.వాళ్లను విచారణకు పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు.కేటీఆర్‌కు బాధ్యత లేదా. మాట్లాడితే కేటీఆర్‌ది తనకంటే ఎక్కువ స్థాయి అంటున్నారు. నేను కేటీఆర్ కంటే ముందే ఎమ్మెల్సీని.2009లో నేను ఏడున్నరవేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిస్తే... కేటీఆర్ 100 ఓట్లతో అత్తెసరు మార్కులతో గెలిచాడు.ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని.రాజకీయంగా నువ్వు నా ముందు వెంట్రుకతో సమానం.కానీ నేనా మాట అనదలుచుకోలేదు.' అని కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు గుప్పించారు.

ఇంత జుగుప్సాకరం ప్రభుత్వానికి కనిపించట్లేదా : రేవంత్ రెడ్డి

ఇంత జుగుప్సాకరం ప్రభుత్వానికి కనిపించట్లేదా : రేవంత్ రెడ్డి


'గత 65ఏళ్ల టీడీపీ,కాంగ్రెస్ పాలనలో కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆరు పబ్బులకే అనుమతి ఉండేది.కానీ టీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 పబ్బులకు అనుమతినిచ్చారు.శనివారం,ఆదివారం రాత్రి 10గం. నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు కొండాపూర్,మాదాపూర్,కావూరి హిల్స్,బంజారాహిల్స్ ఏరియాల్లో పబ్బులు నడుస్తున్నాయి. సీఎం గారు ఒకసారి రాత్రి మొత్తం రహస్యంగా రౌండ్స్ కొట్టండి. అసలు ఏ ప్రపంచంలో మనం ఉన్నామో తెలుస్తుంది.12,14ఏళ్ల ఆడపిల్లల నుంచి మొదలుపెడితే చాలామంది స్పృహలో లేకుండా తాగి,ఊగి రోడ్ల మీద దొర్లుతుంటే.... 7లక్షల సీసీ కెమెరాలు పెట్టామని చెప్పుకుంటున్నవారికి... ఇంత జుగుప్సాకరమైన అసాంఘీక కార్యక్రమాలు కనిపించట్లేదా.మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పిల్లలు కూడా పబ్బులు నడుపుతున్నారు.రాత్రి 11గంటలకు బంద్ కావాల్సిన పబ్బులు తెల్లవారుజాము వరకు నిర్వహిస్తుంటే చర్యలేవి.తెలంగాణను తాగుబోతుల అడ్డా,మత్తుకు బానిసలుగా మార్చి ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనుకుంటున్నారా.' అని రేవంత్ ప్రశ్నించారు.

అకున్ సబర్వాల్‌ను విచారణ నుంచి ఎందుకు తప్పించారో : రేవంత్ రెడ్డి

అకున్ సబర్వాల్‌ను విచారణ నుంచి ఎందుకు తప్పించారో : రేవంత్ రెడ్డి


'తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే హైదరాబాద్ నగరంలో గుడుంబా,గంజాయి,డ్రగ్స్,విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని... దీనికి సంబంధించిన వ్యవహారాలలో చాలామంది ప్రముఖులు ఉన్నారని ఎక్సైజ్ శాఖ చెప్పడం జరిగింది.ఆ సందర్భంగా ప్రభుత్వం దీనిపై విచారణకు సిట్‌తో ఐపీఎస్ అకున్ సబర్వాల్ నేత్రుత్వంలో నియమించారు.ఆయన నిజాయితీగా వ్యవహరిస్తారనే ట్రాక్ రికార్డు ఉన్నది.ఏం జరిగిందో తెలియదు గానీ విచారణ మధ్యలో ఉండగానే ఆ అధికారి బదిలీ అయ్యాడు.ఆ తర్వాత వచ్చిన అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామందిని తప్పించారని వార్తలు వచ్చాయి.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం కేంద్ర సంస్థలకు ఆ సమాచారం ఇవ్వనంటోంది : రేవంత్ రెడ్డి

ప్రభుత్వం కేంద్ర సంస్థలకు ఆ సమాచారం ఇవ్వనంటోంది : రేవంత్ రెడ్డి


'ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సమాచారం మేరకు... ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర పరిధిలో మాత్రమే విచారణ చేయగలదు.గంజాయి పండించేవాళ్లను,విక్రయించేవాళ్లను మాత్రమే పట్టుకోగలరు.అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న నేరాలను నిషేధించేందుకు,విచారించేందుకు వారికి పరిధి లేదు.కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులతో సిట్‌ను నియమించి ఉంటే దీనిపై లోతైన విచారణ జరిగేది.ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశాను.దీనిపై 2017లో హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశాను. కోర్టు తెలంగాణ హోం శాఖతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలైన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో,డైరెక్టరేటర్ రెవెన్యూ ఇంటలిజెన్స్,సీబీఐ,ఈడీలకు నోటీసులిచ్చింది. విచారణకు తాము సిద్దమని కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టుతో చెబితే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ శాఖ విచారణ వివరాలను కేంద్ర సంస్థలకు ఇవ్వమని చెప్పింది.' అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అలా అయితేనే అన్నీ బయటపడుతాయి : రేవంత్ రెడ్డి

అలా అయితేనే అన్నీ బయటపడుతాయి : రేవంత్ రెడ్డి

'బెంగళూరులో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూస్తే అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు వినిపించాయి.ముంబైలో డ్రగ్స్ పట్టుబడితే అందులో తెలుగు సినిమాల్లో పనిచేసే వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి.డ్రగ్స్ మహమ్మారి పట్టిపీడుస్తుంటే,హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బతీస్తుంటే,అత్యాచారాలు,మర్డర్లు జరిగితే నగరానికి విదేశీ పెట్టుబడులు వస్తాయా.ఇది విశ్వనగరమా.. విష సంస్కృతి నగరమా అని కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నా.కేంద్ర సంస్థలతో కలిసి తెలంగాణ ఎక్సైజ్ శాఖతో కలిసి సిట్ వేస్తే... అన్నీ బయటపడుతాయి. అలా చేస్తే వారిని ఉరికంభం ఎక్కించవచ్చు.అయినా ప్రభుత్వం సమాచారం ఇవ్వకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది.' అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
TPCC chief Revanth Reddy questioned why Minister KTR was not came to gun park to accept white challenge over drugs issue. He said that he was directly asking KTR to be the same ... He once again called for being a role model for the youth of the state with the White Challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X