రేవంత్‌కు షాక్: టీఆర్ఎస్‌ లోకి అనుచరులు.. 30వాహనాల్లో హైదరాబాద్‌కు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొడంగల్ చుట్టే తిరుగుతున్నాయి. పార్టీ మారిన రేవంత్‌కు కొంతమంది అనుచరులు మద్దతుగా నిలబడగా.. మరికొంతమంది మాత్రం షాక్ ఇస్తున్నారు.

తాజాగా కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం తమ అనుచరులతో కలిసి 30వాహనాల్లో వారు హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం.

revanth reddy supporters joins trs

బుధవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో వీరు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. కార్యక్రమంలో పలువరు మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో టీఆర్ఎస్ కొడంగల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఒకవేళ ఉపఎన్నిక వస్తే రేవంత్ ను ఓడించడం ద్వారా తమ బలాన్ని మరింత పెంచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం భారీగానే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో.. కొడంగల్ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు ఊపందుకున్నట్టు కనిపిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revanth Reddy supporters joining in TRS on tuesday at Telangana Bhavan in Hyderabad Kosgi

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి