Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీపీసీసీ చీఫ్ గా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి .. భారీ ర్యాలీ, గాంధీ భవన్ లో పగ్గాలు చేపట్టిన ఫైర్ బ్రాండ్ !!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరం చేశారు. వేద పండితుల ఆశీర్వచనం మధ్య మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుండి బాధ్యతలను స్వీకరించారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణికం ఠాగూర్, ఏఐసిసి ఇంచార్జి కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ తదితరులు హాజరయ్యారు.

భారీ ర్యాలీతో గాంధీ భవన్ కు వెళ్ళిన రేవంత్ రెడ్డి .. శ్రేణుల ఘన స్వాగతం

భారీ ర్యాలీతో గాంధీ భవన్ కు వెళ్ళిన రేవంత్ రెడ్డి .. శ్రేణుల ఘన స్వాగతం

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం లో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భారీ ర్యాలీతో గాంధీభవన్ కు చేరుకున్న రేవంత్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఆపై ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ కు చేరుకున్నారు. కార్యకర్తల కోలాహలం మధ్య రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టారు.

భారీగా వచ్చిన నాయకులు , కార్యకర్తలు

భారీగా వచ్చిన నాయకులు , కార్యకర్తలు

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపద్యంలో గాంధీభవన్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో గాంధీ భవన్, నాంపల్లి సహా పరిసర ప్రాంతాలలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు దారి మళ్లిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గోవా పిసిసి అధ్యక్షుడు గిరీష్ చోడేకర్, అండమాన్ పిసిసి అధ్యక్షులు కుల్దీప్ శర్మ, ఎర్నాకులం ఎంపీ హెడెన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తారీక్ అన్వర్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, ఇది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం పని చెయ్యాలని రేవంత్ ను కోరిన ముఖ్య నాయకులు

కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం పని చెయ్యాలని రేవంత్ ను కోరిన ముఖ్య నాయకులు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,భట్టి విక్రమార్క, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్ ,మల్లురవి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకు రావాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోయేలా రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ని టీపీసీసీ చీఫ్ గా నియమించడంపై మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి సోదరులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ భవన్ కు హాజరయ్యారు. వి హనుమంత రావు సైతం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+