కెసిఆర్ దత్తత గ్రామంలో రేవంత్‌కి చేదు, తీపి: రమణ హెచ్చరిక (పిక్చర్స్)
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దత్తత తీసుకున్న చిన్నముల్కనూరు గ్రామంలో సోమవారం పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు స్వాగతాలతో పాటు చేదు అనుభవం కూడా ఎదురైంది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్ తాను దత్తత తీసుకున్న గ్రామంలో కేవలం రెండొందల ఇళ్లను ఎందుకు కట్టించలేకపోయారని ప్రశ్నించారు.
కేసీఆర్ హామీ మేరకు ఇళ్లు కూల్చుకుంటే ఆరు నెలలైనా అతీగతీలేకుండా పోయిందన్నారు. ఆయన చిన్న ముల్కనూర్‌లో ఇళ్లు కూల్చుకొని గుడిసెలు, రేకుల షెడ్లలో ఉన్న వారితో మాట్లాడారు. సీఎం కెసిఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఆయనిచ్చిన రెండు పడక గదుల ఇళ్ల హామీతో ఇక్కడి ప్రజలు తమకున్న ఇళ్లను కూల్చుకున్నారన్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు రేవంత్ రెడ్డికి తమ సమస్యలను విన్నవించారు. గ్రామస్తుల సమస్యలపై శాసనసభలో పోరాడుతానన్నారు. అదే సమయంలో మరికొంతమంది రేవంత్ రెడ్డికి షాకిచ్చారు. సిఎం కెసిఆర్ పైన తమకు నమ్మకముందని, ఆయన ఇల్లు కట్టిస్తాడని చెప్పాడని, అది చేస్తాడన్నారు.
మీరు ఈ రోజు వచ్చి వెళ్తారని, మా బాధలు తీర్చుతారా, మీకు మా సమస్యలు చెప్పుకునే అవసరం ఏమిటని కొందరు ప్రశ్నించారు. చిలుకవ్వ అనే మహిళ రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు కురిపించారు. చిన్నముల్కనూర్‌ను సీఎం కెసిఆర్ దత్తత తీసుకున్నాక గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఆరు నెలలుగా ఇండ్లు కట్టించడం లేదంటూ రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయ రమణారావు, మరికొందరు గ్రామంలో పర్యటించారు. రేవంత్ రెడ్డి వస్తున్నారని, అందరూ ఇంటివద్దే ఉండాలని టిడిపి నేతలు నాలుగు రోజులుగా గ్రామంలో చెప్పారని, అయినప్పటికీ అట్టర్ ప్లాప్ అయిందని తెరాస చెబుతోంది.
ఇదిలా ఉండగా, సోమవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్‌లో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టిఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్రస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు.

రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దత్తత తీసుకున్న చిన్నముల్కనూరు గ్రామంలో సోమవారం పర్యటించారు.

హైదరాబాదులో టిఎన్ఎస్ఎఫ్ భేటీ
పార్టీని వీడి ఒక నాయకుడు ఇతర పార్టీలోకి వెళితే మరో వెయ్యి మంది నేతలను తయారుచేసే సత్తా టిడిపికి ఉందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టిఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్రస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

హైదరాబాదులో టిఎన్ఎస్ఎఫ్ భేటీ
సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. ఎల్ రమణ మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు.

హైదరాబాదులో టిఎన్ఎస్ఎఫ్ భేటీ
తెరాస ఎన్నికల హామీలను అమలుచేసేలా ప్రభుత్వం మెడలు వంచి పోరాడే సత్తా ఒక్క టిఎన్‌ఎస్‌ఎఫ్‌కే ఉందని ఆయన చెప్పారు.

హైదరాబాదులో టిఎన్ఎస్ఎఫ్ భేటీ
మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలని మార్చి మొదటివారంలో రాష్ట్ర సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని తెలిపారు. 3 నెలల్లోగా టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇవ్వకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications