వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా క్లిష్ట సమయంలో కాంగ్రెస్ బాసట.!బొల్లారం ఆస్ప‌త్రిని కోవిడ్ హాస్పటల్ గా మార్చిన రేవంత్ రెడ్డి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అబయ హస్తం అందిస్తోంది. రాష్టం నలుమూలల నుండి కాంగ్రెస్ నేతలు కరోనా బాదితులుకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వి. హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, జాతీయ కార్యదర్శి దాసోజు శ్రవణ్ తో పాటు ఎనఎస్ యూఐ నేతలు కరోనా పేషెంట్లకు ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తున్నారు.

 ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన బొల్లారం కోవిడ్ ఆస్ప‌త్రి.. పీహెచ్ సీని దత్తత తీసుకున్న రేవంత్ రెడ్డి.

ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన బొల్లారం కోవిడ్ ఆస్ప‌త్రి.. పీహెచ్ సీని దత్తత తీసుకున్న రేవంత్ రెడ్డి.

ప్రదానంగా మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం యాభై ఆక్సిజ‌న్‌ ప‌డ‌క‌ల కోవిడ్ ఆస్ప‌త్రిని అందుబాటులోకి తీసుకొచ్చి కోవిడ్ బాధితుల‌కు వైద్యం అందిస్తామంటూ మాల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స‌భ్యుడు రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ హాస్ప‌ట‌ల్‌ను కరోనా బాదితుల కోసం ప్రారంభించారు. అనంత‌రం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఆస్పత్రిలో క‌ల్పించిన స‌దుపాయాల‌ను అడిగి తెలుసుకున్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో రెండో వేవ్ క‌రోనా విజృంభ‌ణ‌తో స‌రైన వైద్యం అంద‌డం లేదని రేవంత్ స్పష్టం చేసారు.

 కోవిడ్ వైద్య సేవ‌లు రెడీ.. ఆస్ప‌త్రిని ప్రారంభించిన మల్కాజిగిరి ఎంపీ..

కోవిడ్ వైద్య సేవ‌లు రెడీ.. ఆస్ప‌త్రిని ప్రారంభించిన మల్కాజిగిరి ఎంపీ..

అంతే కాకుండా ఆక్సిజ‌న్ బెడ్స్ లేక చాలా మంది కోవిడ్ బాధితులు మృత్యువాత ప‌డుతున్నారనే విష‌యం రేవంత్ రెడ్డి దృష్టికి రావ‌డంతో ఆయ‌న కంటోన్మెంట్ బొల్లారం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని యాభై ప‌డ‌క‌ల ఆక్సిజ‌న్ బెడ్స్ ఆస్ప‌త్రిగా తీర్చిదిద్ధి క‌రోనా బాధితుల‌కు వైద్యం అందించాల‌ని సంక‌ల్పించారు. కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్‌సీని ద‌త‌త్త తీసుకున్నారు. అందులో భాగంగా పదిహేను రోజుల క్రితం బొల్లారం ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. కోవిడ్ ఆస్ప‌త్రి ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన స‌దుపాయాలపై అధికారుల‌తో చ‌ర్చించారు. ఇందుకోసం త‌న సొంత నిధులు, ఎంపీ ఫండ్స్‌, త‌న ఆత్మీయులు, స‌హ‌చ‌రుల స‌హాకారంతో ఆస్ప‌త్రికి అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు, వైద్య ప‌రికరాలు, సిబ్బందిని నియ‌మించారు.

 ఆస్ప‌త్రిలో ఆధునిక వైద్య స‌దుపాయాలు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ఎంపీ సొంత నిధులు..

ఆస్ప‌త్రిలో ఆధునిక వైద్య స‌దుపాయాలు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ఎంపీ సొంత నిధులు..

పనులు పూర్తి అవ్వ‌డంతో ఈ రోజు ఆస్ప‌త్రి అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వ్యాక్సిన్ కార్యక్ర‌మం కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.రెమిడెసివిర్ తోపాటు కోవిడ్‌కు అవ‌స‌ర‌మైన మందులు, చికిత్స పూర్తిస్థాయిలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు.త్వ‌రలో బొల్లారం ఆస్ప‌త్రిని వంద ప‌డ‌క‌ల కోవిడ్ ఆస్ప‌త్రిగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో కంటోన్మెంట్ సీఈవో, డాక్ట‌ర్లు, సిబ్బంది ఇత‌ర అధికారులు , స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 50 ఆక్సీజన్ సిలిండర్లను పంపిణీ చేసిన మరో ఎంపీ.. ప్రజాసేవలో ముందుంటామన్న కోమటిరెడ్డి

50 ఆక్సీజన్ సిలిండర్లను పంపిణీ చేసిన మరో ఎంపీ.. ప్రజాసేవలో ముందుంటామన్న కోమటిరెడ్డి

క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోన్నవేళ‌ రోగుల కోసం ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి భువ‌న‌గిరి ప్ర‌భుత్వాసుప‌త్రి 25 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను, 25 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను ఎయిమ్స్‌కు జిల్లా క‌లెక్ట‌ర్ అనితా రామ‌చంద్ర‌న్‌గారికి అంద‌జేశారు. ఈ సందర్బంగా కోమ‌టిరెడ్డి స్పందిస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ‌ల్ల ఇబ్బంది ప‌డుతుంటే బార‌త్ ఎక్కువ ప్ర‌భావితం అయ్యింద‌ని వివరించారు. అలాగే మిగిలిపోయిన ఎంపీ ల్యాడ్స్ నిధుల‌ను క‌రోనా చికిత్స కోసం ఏర్పాటు చేసే సౌక‌ర్యాల‌కు కేటాయించిన‌ట్లు తెలిపారు. అలాగే క‌రోనా విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్ని కోట్లు అయిన ఖ‌ర్చు పెడుతాన‌ని చెప్పిన సీఎం చంద్రవేఖర్ రావు ఆరోగ్య శ్రీలో ఎందుకు క‌రోనా చికిత్స‌ను చేర్చ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. త‌ప్పుడు క‌రోనా లెక్క‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని కోమ‌టిరెడ్డి. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

English summary
The Congress party is extending a helping hand to the people who are facing many difficulties at a time when Corona is booming. Congress leaders from all over the state are carrying out relief programs for corona victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X