రేవంత్‌కు మంచి ప‌ద‌వి.. మిగిలినవారికి ఎమ్మెల్యే టికెట్లు : ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: త‌మ పార్టీలో చేరిన టీడీపీ నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడారు.

  Big Shock To Revanth Reddy రేవంత్‌కు బిగ్ షాక్ | Oneindia Telugu

  టీడీపీ నుంచి త‌మ పార్టీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి 2019 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌లో మంచి పదవి దక్కుతుందని ఉత్తమ్ చెప్పారు. మిగ‌తా నేత‌లు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డిలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామ‌ని పేర్కొన్నారు.

  uttam-kumar-reddy

  అలాగే పార్టీ జంప్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న‌ నాగం జ‌నార్ద‌న్ రెడ్డి అంశంపై కూడా ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఆయ‌న చేరికపై తాను మాట్లాడలేనని తెలిపారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీకి త‌మ పార్టీయే ప్ర‌త్నామ్యాయ‌మ‌ని ఉత్తమ్ స్పష్టం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy who jumped from TTDP will get a good post in Congress.. said TPCC Chief Uttam Kumar Reddy here in Hyderabad on Friday in a Press meet. Other leaders Seethakka, Vem Narendar Reddy, Vijaya Ramana Rao, Arikela Narsa Reddy will get MLA Tickets, Uttam added. In Telangana.. only Congress Party is the alternate for TRS, he concluded.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి