Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందర్నీ ఢిల్లీకి తీసుకెళ్లండి: కెసిఆర్‌కు రేవంత్, వారిపై నమ్మకం లేదు.. మీరే: రాజ్‌కు డిగ్గీ

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరేందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రభుత్వానికి అనేక మంది వినతిపత్రాలు ఇచ్చారని చెప్పారు. ఇది రగులుతున్న సమస్య అన్నారు.

Revanth Reddy writes to KCR to lead All Party delegation to Centre

షబ్బీర్ అలీకి భద్రత కల్పించాలి: దిగ్విజయ్

తెలంగాణ శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అళీకి తగిన భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.

ఈ మేరకు శనివారం రాజ్‌నాథ్‌కు లేఖ రాశారు. షబ్బీర్ అలీకి బెదిరింపు కాల్ రాగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారు చర్య తీసుకుంటారనే నమ్మకం లేదని దిగ్విజయ్ అన్నారు

మరోవైపు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ... షబ్బీర్ అలీని బెదిరించే స్థాయి మాకు ఉందా అని ఎద్దేవా చేశారు. భౌతిక దాడులు, బెదిరింపులు టిఆర్ఎస్ సంస్కృతి కాదని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని తనను కొందరు బెదిరిస్తున్నట్లు షబ్బీర్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్ స్పందించారు. షబ్బీర్ అలీ ఫిర్యాదు ఆధారంగా ఆయన సమర్పించిన ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేస్తారని, ఒకవేళ అది తమ పార్టీ కార్యకర్తది అని తేలితే అరెస్టు చేయాలనే నేను కోరుతానని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+