'కీలక ప్రాజెక్ట్ పేరు మార్పు.. 24 గంటల్లో జీవో జారీ'
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్మారక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక ప్రకటన చేశారు. ఎస్సారెస్పీ రెండో దశ కాలువకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును పెడుతున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ మేరకు ఎస్సీరెస్పీ-2 కు ఆర్డీఆర్ అని నామకరణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దానికి కారణం దామోదర్ రెడ్డి అని అన్నారు. దీనికి సంబంధించి 24 గంటల్లో జీవో తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నల్గొండలో కీలక ప్రాజెక్ట్ అయిన ఎస్సారెస్పీ రెండో దశ కాలువకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఏర్పాటు చేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్మారక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్సారెస్పీ 2 ను ఇకపై ఆర్డీఆర్ గా మారుస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు 24 గంటల్లో జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. దామోదర్ రెడ్డి జీవితమంతా ప్రజా శ్రేయస్సు కోసమే సాగిందని అన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్నే నిలిచారన్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి 40 ఏళ్ల క్రితమే సాగు నీటికోసం పోరాడిన నాయకుడని కొనియాడారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలకు సాగు, తాగునీటి కోసం, అభివృద్ధి కోసం తన జీవిత కాలం పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మరోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం మాట్లాడారు. మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ముందుకు సాగిన నేత అని కొనియాడారు. తన ఆరోగ్యం, వయసును లెక్కచేయకుండా తాను చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి దురదృష్టకరమని పేర్కొంటూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
కేసీఆర్ కు జీతం కట్ పై నిర్ణయం: సీఎం రేవంత్ -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications