కేసీఆర్ భోజనంపై రేవంత్‌కు కిషన్ దిమ్మతిరికే కౌంటర్, అది తేలిపోయింది: కాంగ్రెస్ హ్యాపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టిడిపి మాత్రం పూర్తిగా నిస్సహాయస్థితిలో కూరుకుపోయింది. రేవంత్ వ్యవహారంలో అధినేత చంద్రబాబు ఏం చేస్తారనే అంశం సస్పెన్స్‌గా మారింది.

టిడిపికి గుడ్‌బై! క్లైమాక్స్‌కు రేవంత్ : వాట్ నెక్స్ట్ ? | Oneindia Telugu

చదవండి: రేవంత్ రెడ్డి ఇష్యూ: సూపర్.. రమణకు బాబు ప్రశంసలు, దేనికి సంకేతం

రేవంత్ వ్యవహారం నేపథ్యంలో టిడిపి - బిజెపిలు కలిసి అసెంబ్లీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చాయి. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను వారు నిలదీయనున్నారు.

చదవండి: రేవంత్ రెడ్డి రూటే సపరేటు!: కాంగ్రెస్‌లోకి ఎందుకు, ఇవీ కారణాలు

టార్గెట్ కాంగ్రెస్ కూడా

టార్గెట్ కాంగ్రెస్ కూడా

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సభలో అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ గత పాలనను కూడా సందర్భం వచ్చినప్పుడు ఎండగట్టాలని టిడిపి, బిజెపి నిర్ణయానికి వచ్చాయి. ఆ రెండు పార్టీలు దొందూ దొందేనని, గతంలో కాంగ్రెస్ ఏ విధంగా పాలించిందో, ఇప్పుడు తెరాస అలాగే పాలిస్తోందని బిజెపి నిప్పులు చెరుగుతోంది.

రేవంత్ వ్యవహారంతో సంబంధం లేదు, కిషన్ ఘాటు కౌంటర్

రేవంత్ వ్యవహారంతో సంబంధం లేదు, కిషన్ ఘాటు కౌంటర్

రేవంత్ రెడ్డి వ్యవహారంపై బిజెపి శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి స్పందించేందుకు నిరాకరించారు. రేవంత్ వ్యవహారం తమకు సంబంధం లేదన్నారు. అది టిడిపి అంతర్గత విషయమని చెప్పారు. కెసిఆర్ చెబితే గోల్కోండ హోటల్లో బిజెపి, టిడిపి భేటీ జరిగిందని, కెసిఆర్ పెట్టే భోజనం తనకు అవసరం లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మీరంతా కూడా కేసీఆర్, కేటీఆర్ చెబితే వచ్చారా అని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం, అది తేలిపోయింది

కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం, అది తేలిపోయింది

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లుగానే కనిపిస్తోంది. ఏది ఏమైనా రేవంత్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటి దాకా టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెప్పుకుంటూ వచ్చాయి. కానీ రేవంత్ ఎపిసోడ్‌తో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మనమే అని తేలిందని కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆలింగనాలు క్లియర్ చేశాయి

ఆలింగనాలు క్లియర్ చేశాయి

అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ తదితరులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో వారు ఆలింగనం చేసుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి టిడిపిలో చేరడం ఖాయమని మరోసారి తేలిందని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bharatiya Janata Party and Telugu Desam Party Telangana State units decided to follow effective floor coordination in the upcoming Legislature session, starting Friday, to corner the government on crucial issues of public importance even as TDP MLA A. Revanth Reddy, who was stripped of his twin posts by the party leadership, did not attend the meeting.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి