రేవంత్‌రెడ్డికి షాక్, వేటు ఖాయం!: సారీ చెప్పు, విషకౌగిలి.. ఎల్ రమణ హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై అధిష్టాన వేటు వేసేలా కనిపిస్తోంది. వేటు తప్పదని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: రేవంత్ రెడ్డి ఇష్యూ: సూపర్.. రమణకు బాబు ప్రశంసలు, దేనికి సంకేతం

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు, టిడిఎల్పీ భేటీపై టి-టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం సాగింది.

చదవండి: ఇదే మంచిది: అప్పుడే రేవంత్ రెడ్డి రెండు కీలక ప్రతిపాదనలు, బాబు ఒకే చెప్పి ఉంటే

మంగళవారం సాయంత్రం ఎల్ రమణ మరోసారి రేవంత్ రెడ్డి విషమయై స్పందించారు. రేపు తెలంగాణ టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం కానుందని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామన్నారు. రేవంత్‌ను పదవుల నుంచి తొలగించనున్నారు.

చదవండి: జనసేన ఆఫీస్ ప్రారంభం, ఖురాన్ పఠించిన అలీ: అతిథిగా సామాన్యుడు, ఏం కావాలని పవన్ అడిగితే (ఫోటోలు)

రేవంత్ విషకౌగిలిలో నలిగిపోవద్దు

రేవంత్ విషకౌగిలిలో నలిగిపోవద్దు

కాంగ్రెస్ పార్టీ విషకౌగిలిలో రేవంత్ రెడ్డి నలిగి పోవద్దని ఎల్ రమణ హెచ్చరించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని చెప్పారు. 35 ఏళ్లయినా తెలుగుదేశం పార్టీకి ఆదరణ తగ్గలేదని వెల్లడించారు.

బాబుకు, పార్టీ నాయకులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి

బాబుకు, పార్టీ నాయకులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి

రేవంత్ రెడ్డిని పార్టీ, చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహించారని ఎల్ రమణ చెప్పారు. చంద్రబాబుకు, పార్టీ నాయకులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సొంత అజెండాతో ముందుకు పోతున్నారని ధ్వజమెత్తారు.

టిడిపి ఓ యూనివర్సిటీ, ఎవరు వెళ్లినా నష్టం లేదు

టిడిపి ఓ యూనివర్సిటీ, ఎవరు వెళ్లినా నష్టం లేదు

తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ యూనివర్సిటీ అని ఎల్ రమణ చెప్పారు. ఈ యూనివర్సిటీలోకి ఎవరు వచ్చి వెళ్లినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. కానీ రేవంత్ కాంగ్రెస్ విషకౌగిలిలో నలికిపోవద్దన్నారు.

వేటు పడటం ఖాయం

వేటు పడటం ఖాయం

రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయడుకు నివేదిక సమర్పించామని చెప్పారు. ఆయనపై వేటు పడటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

ముదిరిన వివాదం

ముదిరిన వివాదం

కాగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే నిర్ణయానికి వచ్చిన తెలంగాణ టిడిపి ఆయనపై దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఆయనను పదవుల నుంచి తొలగించాలని రమణ.. చంద్రబాబుకు లేఖ రాశారు. అంతేకాదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టిడిఎల్పీ నేతగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించారు. మరోవైపు రేవంత్.. శాసన సభపక్షాన్ని ఆదేశించే అధికారం ఎవరికీ లేదన్నారు. తాను శాసన సభా పక్ష భేటీ నిర్వహిస్తానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP Telangana president L Ramana on Wednesday announced that party National President N Chandrababu Naidu has directed Revanth Reddy to take up any programmes as the TDP Telangana working president.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి