రేవంత్ టీం నేడే బాధ్యతల స్వీకరణ: కాంగ్రెస్ లో కోలాహాలం ..ప్రముఖల రాక : ఫైర్ బ్రాండ్ షెడ్యూల్ ఇలా..!!
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మరి కొద్ది గంటల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, కమిటీల చైర్మన్లు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి రేవంత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు ఒక విధంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ కు టీపీసీసీ చీఫ్ గా ప్రకటన తరువాత కొత్త జోష్ కనిపిస్తోంది. రేవంత్ సైతం కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను మచ్చిక చేసుకొనే పని ప్రారంభించారు.

సీనియర్ల వద్ద విధేయత ప్రదర్శిస్తూ..
అందరినీ కలుపుకుపోతాననే సంకేతాలిచ్చారు. అందులో భాగంగా దాదాపు వారం రోజుల పాటు పార్టీ సీనియర్ల ఇంటికి వెళ్లి మరీ వారి మద్దతు కోరారు. దీని ద్వారా రేవంత్ పార్టీలో తన పట్టు సాధించటానికి తొలి మెట్టు ఎక్కారు. సీనియర్లు తొలుత నో అన్న వారు సైతం ఇప్పుడు రేవంత్ తనంటగా తాను తమ దగ్గరికి రావటంతో వారు సైతం మద్దతిస్తున్నారు. ఇక, రేవంత్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పార్టీ నేతలు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ప్రధానంగా బైక్ ర్యాలీలు... ప్రదర్శనలకు నిర్ణయించారు.

రేవంత్ షెడ్యూల్ ఇలా..
గాంధీ భవన్ ఎప్పుడూ లేని విధంగా కొత్త కాంతులతో వెలిగిపోతోంది. పార్టీ నేతల ఫొటోలకు అవకాశం లేకుండా...కేవలం సోనియా - రాహుల్ ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేసారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక, రేవంత్ ఉదయమే తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడినుంచి నాంపల్లి దర్గాకు చేరుకుని, ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుని 1.30 గంటలకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. రేవంత్‌తోపాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, కమిటీల చైర్మన్లు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఏఐసీసీ నేతల హాజరు..
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, గోవా, అండమాన్ పీసీసీల అధ్యక్షులు హాజరు కానున్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనల మేరకే నిర్వహిస్తున్నా.. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. రేవంత్ కు పీసీసీ ఇవ్వటం పైన కొంత గుర్రుగా ఉన్న సీఎల్పీ నేత భట్టి నివాసానికి వెళ్లిన రేవంత్ 45 నిముషాలపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Recommended Video

టార్గెట్ కేసీఆర్..సవాళ్లు ఆరంభం
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో రేవంత్‌రెడ్డి బలంగా మారినా.. భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్లూ ఎదురు చూస్తున్నాయి. షర్మిల పెట్టబోయే పార్టీ.. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టకుండా చూసుకోవడమూ మరో సవాలు కానుంది. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న అసంతృప్తులు, అసమ్మతివాదులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో టార్గెట్ కేసీఆర్ గా రేవంత్ కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభం అవుతోంది. కేసీఆర్ ఎత్తుగడలను ఎదుర్కొంటూ..పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించుకుంటూ రేవంత్ ముందుకు సాగాల్సి ఉంది.
-
ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. జీతంలో ప్రతి నెలా రూ. 10వేలు కట్: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications