Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీలో రేవంత్ మంత్రాంగం - మంత్రి పదవులు ఖరారు..!!

ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో వరదలు మిగిల్చిన నష్టం పై కేంద్రంతో చర్చించనున్నారు. ఇవాళ అమిత్​ షాను కలిసి రాష్ట్రంలో వర్షాలు, వరదలు మిగిల్చిన అపార నష్టంపై పూర్తి వివరాలను సీఎం రేవంత్​ రెడ్డి అందజేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ను కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ..కొత్తగా మంత్రులెవరనేది నేడు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

అమిత్ షాతో చర్చలు
తెలంగాణలో వర్షాలు..వరదలతో జరిగిన నష్టం పైన ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. సుమారు రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రాథమికంగా కేంద్రానికి నివేదించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్​ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్న పరిస్థితులను వివరించనున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రానికి విన్నవించనున్నారు.

Revanth To meet Amith Shah to seek flood relief funds in his delhi visit

కేంద్ర సాయం కోరుతూ
జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సాయం చేయాలని రేవంత్ కోరనున్నారు. ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ ఖరారైతే ముఖ్యమంత్రి వారిని కలిసి వర్షాలతో జరిగిన నష్టం వివరాలు అందజేయనున్నారు. ఇదే పర్యటనలో సీఎం రేవంత్​ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ను కలిసే అవకాశం ఉంది. వీలు కుదిరితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలుస్తారని సమాచారం. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్​ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ పెద్దల ఆమోదం తీసుకోనున్నారు.

మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణపైనా అధిష్ఠానం సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కొత్తగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు అవకాశముంది. వాటిలో ఒకట్రెండు పెండింగ్‌లో పెట్టి మిగిలినవి భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సామాజికవర్గం లెక్కలతో వాకిటి శ్రీహరి ముదిరాజ్‌, పి.సుదర్శన్‌రెడ్డి, గడ్డం వివేక్‌, లకు అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. సీఎంతో పాటుగా ఢిల్లీ వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్ మల్లిఖార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ నెల 15న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ పెద్దలను ఆహ్వానించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+