• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Revanth vs Sharmila: రెడ్డి వర్గం ఎవరివైపు : ఇద్దరి లక్ష్యం-మార్గం అదే..గెలిచేదెవరు..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఒక్క నియామకం అనేక సమీకరణాలు తెర తీస్తోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకం తో రాజకీయంగా ఈక్వేషన్లు మారుతున్నాయి. ఒక్క రోజు తేడాతో ఇద్దరు నేతల కీలక ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. జూలై 7న రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతల చేపట్టనున్నారు. జూలై 8న షర్మిల తెలంగాణలో తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే, ఇప్పుడు ఇద్దరి టార్గెట్ సీఎం కేసీఆర్. ఇద్దరూ ఇప్పుడూ అందు కోసం ఒకే మార్గాన్ని ఎంచుకున్నారు. సామాజిక వర్గాల మద్దతు కీలకం అవుతోంది. మరి..వైఎస్సార్ ను ఈ ఇద్దరిలో ఎవరు ఓన్ చేసుకుంటారు.

Recommended Video

Revanth Reddy As TPCC President: Chandrababu Role ? | Oneindia Telugu
రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఎవరికి...

రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఎవరికి...

తన తండ్రి పాలన తిరిగి అందిస్తానని షర్మిల...చివరి నిమిషం వరకు తమ పార్టీలోనే వైఎస్సార్ ఉన్నారంటున్న రేవంత్. సో..ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ కొత్త రాజకీయానికి నాంది కానుంది. తెలంగాణలో కేసీఆర్ ను ఎదర్కోవటమే లక్ష్యంగా రేవంత్ ను కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ చీఫ్ ను చేసింది. రేవంత్ పైన ఎన్నో అంచనాలతో ఈ పదవి అప్పగించింది. అదే సమయంలో షర్మిల సైతం తెలంగాణ కేంద్రంగా రాజకీయం మొదలు పెట్టారు.

బీజేపీ..కాంగ్రెస్ కంటే వ్యక్తిగతంగా ఈ ఇద్దరూ ఇప్పటికే కేసీఆర్ పైన విమర్శలు చేయటంలో ముందున్నారు. ఇక, సామాజిక వర్గాల పరంగా తెలంగాణలో బీసీ తరువాత రెడ్డి వర్గం రాజకీయంగా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెడ్డి వర్గం రాజకీయ పదవుల్లో కీలకంగా ఉంది.

 ఇద్దరి టార్గెట్ సీఎం కేసీఆర్..

ఇద్దరి టార్గెట్ సీఎం కేసీఆర్..

సామాజిక సమీకరణాలే తెలంగాణలో రాజకీయం గా గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. బీజేపీ బీసీ ఫ్యాక్టర్ ను నమ్ముకుంది. కాంగ్రెస్ రెడ్డి నేతకు పగ్గాలిచ్చింది. పీసీసీ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత అని చెబుతున్నా..రేవంత్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. ఇక, తన తండ్రి పేరుతో రాజకీయం చేస్తున్న షర్మిలకు ఈ వర్గం మద్దతు ఉందనే ప్రచారం ఉంది.

రేవంత్ ఎంట్రీతో ఇప్పుడు ఈ వర్గం నేతలు ఎవరితో నిలుస్తారనేది కీలక అంశం. రేవంత్ రెడ్డి నియామకాన్ని రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఇది షర్మిలకు అనుకూలంగా మారుతుందా లేదా చూడాలి. ఇక, షర్మిల పూర్తిగా తన తండ్రి ఇమేజ్ ఆధారంగానే రాజకీయం చేస్తున్నారు.

 పాదయాత్రలు.. వైఎస్సార్ ఇమేజ్..

పాదయాత్రలు.. వైఎస్సార్ ఇమేజ్..

దీనికి చెక్ పెట్టే విధంగా రేవంత్ తాజా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ వాది అని..చివరి నిమిషం వరకు కాంగ్రెస్ తోనే ఉన్నారంటూ..తమ నేతగా ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఇద్దరు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎందచుకున్నమార్గం ఒకటే. పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావాలని షర్మిల ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో రేవంత్ సైతం ఆలంపూర్ నుండి అదిలాబాద్ వరకు పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఇద్దరికీ తెలంగాణలో అధికారం దక్కించకోవటమే లక్ష్యం.

 పొలిటికల్ గేమ్ షురూ..

పొలిటికల్ గేమ్ షురూ..

వైఎస్ ఇమేజ్ షర్మిలకు కలిసొచ్చే అంశం. వాగ్ధాటి..యువత ఫాలోయింగ్ రేవంత్ కు పార్టీతో పాటుగా అదనపు బలం. అయితే, ఏపీ సీఎం జగన్ పైన విమర్శలు చేయటానికి రేవంత్ వెనుకాడే పరిస్థితి లేదు. కానీ, షర్మిల సైతం ఇప్పుడు అందుకు సిద్దపడాల్సిన రాజకీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

క్షేత్ర స్థాయిలో నిర్మాణం లేని పార్టీ ద్వారా ఆత్మ విశ్వాసంతో షర్మిల.. కేసీఆర్ వ్యతిరేకత ఆయుధంగా రేవంత్ ముందుకెళ్తున్నారు. అయితే, వర్గ పోరాటాలు... కలిసి రాని సీనియర్లు రేవంత్ కు మైనస్. ఇక, అటు షర్మిల.. ఇటు రేవంత్ పాదయాత్రలు ప్రారంభించిన తరువాత తెలంగాణలో రాజకీయంగా అసలు ఆట షురూ కానుంది. దీంతో..ముందుగానే ఎవరి అస్త్రాలు వారి సిద్దం చేసుకుంటున్నారు.

English summary
After Revanth appointed as TPCC Chief comparision and social equations between Sharmila and Revanth are creatiing interest in political circles. Both leaders preparing for padayatra in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X